అక్షరటుడే, ఇందూరు: Kalyana Lakshmi | రాష్ట్ర ప్రభుత్వం తులం బంగారం ఇవ్వకున్నా.. కనీసం కల్యాణ లక్ష్మి నగదునైనా పెంచాలని అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ గుప్తా(MLA Dhanpal Surya Narayana) అన్నారు. జిల్లాకేంద్రంలోని రాజీవ్ గాంధీ ఆడిటోరియంలో మంగళవారం కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ (Shaadi Mubarak) చెక్కులను పంపిణీ చేశారు.
Kalyana Lakshmi | ఇచ్చిన హామీలను నెరవేర్చడం లేదు..
ఎమ్మెల్యే మాట్లాడుతూ…కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను ఎలాగో నెరవేర్చడం లేదని అన్నారు. కనీసం కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ నిధులను పెంచాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. లబ్ధిదారులు ప్రధానంగా దళారులను ఆశ్రయించకుండా నేరుగా అధికారులను సంప్రదించాలన్నారు. మొత్తం రూ.1.71 కోట్ల విలువ ఉన్న 171 కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులను( Welfare Schemes) పంపిణీ చేశారు. కార్యక్రమంలో ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ, బీజేపీ కార్పొరేటర్లు నాగోల్ల లక్ష్మీనారాయణ, మఠం పవన్, బంటు ప్రీతి ప్రవీణ్, బెల్లాల్ శశాంక్, తదితరులు పాల్గొన్నారు.

ఇది కూడా చదవండి: ఈ ఫంక్షన్‌కి నన్ను చీప్ గెస్ట్ గా పిలిచారు.. – #Brahmanandam