అక్షరటుడే, వెబ్‌డెస్క్: Yadagirigutta Temple Board | యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామి దేవస్థానం పాలక మండలిని తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. దేవస్థానం బోర్డు చైర్మన్‌గా సత్యనారాయణరెడ్డిని నియమించగా, మొత్తం 18 మంది సభ్యులతో పాలక మండలిని ఏర్పాటు చేసింది.
Yadagirigutta Temple Board | మంత్రి కొండా సురేఖ
ఈ కొత్త బోర్డులో సినీ నటుడు చిరంజీవి సతీమణి కొణిదెల సురేఖకు సభ్యురాలిగా చోటు కల్పించడం విశేషంగా నిలిచింది. అలాగే మంత్రి కొండా సురేఖ, స్థానిక ఎమ్మెల్యే వినోద్‌తో పాటు పలువురికి కూడా పాలక మండలిలో స్థానం దక్కింది.
యాదగిరిగుట్ట దేవస్థానం అభివృద్ధి, ఆలయ పరిపాలన, భక్తులకు మెరుగైన సౌకర్యాల కల్పన, దేవస్థానం నిర్వహణకు సంబంధించిన కీలక నిర్ణయాలను ఈ పాలక మండలి తీసుకోనుంది. ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వులతో కొత్త బోర్డు అధికారికంగా బాధ్యతలు చేపట్టనున్నట్లు వెల్లడైంది.
