Eagle Inspections | గోపాల్‌పేట్‌లో ఈగల్ బృందం తనిఖీలు..

నాగిరెడ్డిపేట మండల పరిధిలోని గోపాల్‌పేట్ గ్రామంలో ఈగల్ టీమ్​ నార్కోటిక్స్, డ్రగ్స్ డాగ్ స్క్వాడ్‌తో సంయుక్తంగా విస్తృత తనిఖీలు నిర్వహించింది. ఎస్సై భార్గవ్​ ఈ మేరకు వివరాలు వెల్లడించారు.

shashi kiran Mottala

అక్షరటుడే, ఎల్లారెడ్డి: Eagle Inspections | నాగిరెడ్డిపేట(nagireddypet) మండల పరిధిలోని గోపాల్‌పేట్ గ్రామంలో ఈగల్ (EAGLE) బృందం నార్కోటిక్స్, డ్రగ్స్ డాగ్ స్క్వాడ్‌తో సంయుక్తంగా విస్తృత తనిఖీలు నిర్వహించింది. ఎస్సై భార్గవ్​ ఈ మేరకు వివరాలు వెల్లడించారు.

Eagle Inspections | కిరాణా దుకాణాలు.. పాన్​షాపులు..

గ్రామంలోని కిరాణా దుకాణాలు, పాన్ షాపులు, టీస్టాళ్లు, విద్యాసంస్థల పరిసరాలు, పాఠశాలలు, కళాశాలల ఆవరణలు, అనుమానాస్పద ప్రాంతాల్లో డాగ్ స్క్వాడ్ సాయంతో క్షుణ్ణంగా (Anti Drug Drive) పరిశీలించారు. పలు ప్రాంతాలను జల్లెడ పట్టారు. గంజాయి, ఇతర మాదక ద్రవ్యాలు, గుట్కా, పొగాకు, సిగరెట్లు, సాగర్ వంటి నిషేధిత, హానికర పదార్థాల అక్రమ నిల్వ, విక్రయం, వినియోగాన్ని అరికట్టేందుకు పోలీసులు ప్రత్యేక దృష్టి సారించారు.

Eagle Inspections | వ్యాపారులకు అవగాహన..

తనిఖీల సందర్భంగా దుకాణదారులకు, ప్రజలకు మాదక ద్రవ్యాలు, గుట్కా, పొగాకు వంటి ఆరోగ్యానికి హానికరమైన పదార్థాలను విక్రయించడం, నిల్వ చేయడం లేదా వినియోగించడం చట్టరీత్యా నేరమని అవగాహన కల్పించారు. ముఖ్యంగా విద్యార్థులను ఇలాంటి వ్యసనాలకు దూరంగా ఉంచాలని సూచించారు. పాఠశాలలు, కళాశాలల సమీపంలో పొగాకు ఉత్పత్తులు, నిషేధిత పదార్థాల విక్రయాలు జరిపితే సంబంధిత వ్యక్తులపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. యువతను మాదక ద్రవ్యాల బారిన పడకుండా కాపాడడం, మాదక ద్రవ్యాల రహిత సమాజ నిర్మాణమే ఈ ప్రత్యేక తనిఖీల లక్ష్యమని అధికారులు తెలిపారు.

eagle

ఇది కూడా చదవండి: పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గించిన ‘నయారా’ 

 

తెలుగు జర్నలిజంలో 20 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2005లో ‘వార్త’ దినపత్రికలో స్పోర్ట్స్​ రిపోర్టర్​గా పనిచేశాను. అనంతరం రెండేళ్ల పాటు సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. 2010లో ‘సాక్షి’ జర్నలిజం స్కూల్​లో శిక్షణ పొందాను. అనంతరం ‘సాక్షి’ దినపత్రికలో సబ్​ఎడిటర్​గా చేరాను. సీనియర్​ సబ్​ ఎడిటర్​గా ప్రమోషన్​ పొందాను. 2024 నవంబర్​ నుంచి ‘అక్షరటుడే’లో చీఫ్​ సబ్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, స్థానికం, జనరల్​, క్రైం, వైరల్​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *