Palnadu Road Accident | రెండు లారీలు ఢీ.. నలుగురు సజీవదహనం

పల్నాడు జిల్లా బోయపాలెం వద్ద ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ఘటనలో నలుగురు సజీవదహనం అయ్యారు.

Srinivas Kolluri

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Palnadu Road Accident | ఏపీలోని పల్నాడు జిల్లా బోయపాలెం వద్ద జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ప్రమాదంలో నలుగురు సజీవదహనం అయ్యారు.

బోయపాలెం గ్రామం సమీపంలో జాతీయ రహదారిపై రెండు లారీలు బుధవారం తెల్లవారుజామున ఎదురెదురుగా ఢీకొని మంటలు చెలరేగాయి. ఈ ఘటనలో ఇద్దరు డ్రైవర్లు, ఇద్దరు క్లీనర్లు మరణించారు. చిలకలూరిపేట నుంచి గుంటూరు వైపు వస్తున్న ఒక లారీ, సెంట్రల్ డివైడర్‌ను దాటి, ఎదురుగా చిలకలూరిపేట వైపు వస్తున్న మరో లారీని ఢీకొట్టింది.

Palnadu Road Accident | మంటలు చెలరేగడంతో..

ఈ ఘటనతో భారీ మంటలు చెలరేగి, నిమిషాల వ్యవధిలోనే రెండు వాహనాలూ పూర్తిగా వ్యాపించాయి. ఒక లారీ రాళ్లను తరలిస్తుండగా, మరొకటి కాగితాల సరుకును తీసుకువెళుతోంది. దీంతో అందులోని డ్రైవర్లు, క్లీనర్లు సజీవ దహనం అయ్యారు. సమాచారం అందిన వెంటనే పోలీసులు, అగ్నిమాపక, సహాయక సిబ్బంది ప్రమాద స్థలానికి చేరుకున్నారు. మంటలను ఆర్పి వేసి మృతదేహాలను బయటకు తీశారు. ప్రమాదానికి గల కారణాలపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

దీనిని కూడా చదవండి : Hyderabad Police Firing | హైదరాబాద్​లో కాల్పుల కలకలం.. దొంగను పట్టుకునేందుకు ఫైరింగ్​ చేసిన పోలీసులు

తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.
1 Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *