Kasturba School Inspection | కేజీబీవీని తనిఖీ చేసిన కలెక్టర్​.. సిబ్బందిపై ఆగ్రహం

రెంజల్ మండల కేంద్రంలోని కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయాన్ని కలెక్టర్ ఇలా త్రిపాఠి గురువారం ఆకస్మికంగా తనిఖీ చేశారు.

shashi kiran Mottala

అక్షరటుడే, బోధన్​: Kasturba School Inspection | రెంజల్ మండల కేంద్రంలోని కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయాన్ని కలెక్టర్ ఇలా త్రిపాఠి (Collector Ila Tripathi) గురువారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా అక్కడి పరిస్థితులను చూసి ఆగ్రహం వ్యక్తం చేశారు.

Kasturba School Inspection | పిచ్చిమొక్కలు.. అపరిశుభ్ర వాతావరణం..

పాఠశాలలోని పరిసరాలను, కిచెన్, స్టోర్ రూమ్, డైనింగ్ హాల్, తరగతి గదులను కలెక్టర్​ పరిశీలించారు. పరిసరాలు పిచ్చి మొక్కలతో నిండి అపరిశుభ్రంగా ఉండడాన్ని గమనించి నిర్వాహకులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. విద్యార్థినులు పాములు, విష కీటకాల బారినపడితే ఎవరు బాధ్యులని నిలదీశారు. వెంటనే పరిసరాలను శుభ్రం చేయించాలని, వర్షపు నీరు నిలువ ఉన్న గుంతలలో దోమలు వృధ్ధి చెందకుండా ఆయిల్ బాల్స్ వేయాలని ఆదేశించారు. సిబ్బంది అటెండెన్స్, మధ్యాహ్న భోజనం మెనూ వివరాలు తెలుసుకున్నారు. ప్రభుత్వం నిర్దేశించిన మెనూ ప్రకారం నాణ్యమైన పౌష్టికాహారాన్ని అందించాలని నిర్వాహకులను ఆదేశించారు. నాసిరకం బియ్యం, సరుకులు సరఫరా చేస్తే వెంటనే మండల అధికారుల దృష్టికి తేవాలని సూచించారు. ఆర్​వో ప్లాంట్ నిరుపయోగంగా ఉండడాన్ని గమనించిన కలెక్టర్, మరమ్మతులు చేయించాలని అన్నారు. బాలికల భద్రతకు ప్రాధాన్యత ఇవ్వాలని, బయటి వ్యక్తులను లోనికి అనుమతించకూడదని ఆదేశించారు. విధుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించే వారిని ఎంతమాత్రం ఉపేక్షించబోమని, తాను వారం రోజుల తర్వాత మళ్లీ పాఠశాలను సందర్శిస్తానని, ఆలోగా అన్ని లోటుపాట్లను చక్కదిద్దుకోవాలని సూచించారు.

Kasturba School Inspection | విద్యార్థులకు ప్రశ్నలు వేసి..

Kasturba School Inspection

అనంతరం పదో తరగతి క్లాస్​రూమ్​ను సందర్శించి, విద్యార్థినులకు పలు ప్రశ్నలు వేస్తూ వారి అభ్యసన సామర్థ్యాన్ని పాలనాధికారి అంచనా వేశారు. తన వెంట తెచ్చిన చాక్లెట్లు, బహుమతులను అందించారు. చక్కగా చదువుకోవాలని, వ్యక్తిగత భద్రత విషయంలో ఏమరుపాటుగా ఉండకుండా అనుక్షణం అప్రమత్తంగా వ్యవహరించాలని బాలికలకు సూచించారు. ఏవైనా ఇబ్బందులు ఎదురైతే అధికారులకు ఫిర్యాదు చేయాలని తెలిపారు. బాలికలకు క్రమం తప్పకుండా ఆరోగ్య పరీక్షలు జరిపించాలని ఆదేశించారు. ఈగలు వృద్ధి చెందకుండా వంటగది, డైనింగ్ హాల్, పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలన్నారు.

ఇది కూడా చదవండి..: Anganwadi Inspections | కలెక్టర్​ వస్తున్నారని తెలిసి అంగన్​వాడీల్లో తనిఖీలు.. ఆగ్రహం వ్యక్తం చేస్తున్న ప్రజలు

తెలుగు జర్నలిజంలో 20 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2005లో ‘వార్త’ దినపత్రికలో స్పోర్ట్స్​ రిపోర్టర్​గా పనిచేశాను. అనంతరం రెండేళ్ల పాటు సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. 2010లో ‘సాక్షి’ జర్నలిజం స్కూల్​లో శిక్షణ పొందాను. అనంతరం ‘సాక్షి’ దినపత్రికలో సబ్​ఎడిటర్​గా చేరాను. సీనియర్​ సబ్​ ఎడిటర్​గా ప్రమోషన్​ పొందాను. 2024 నవంబర్​ నుంచి ‘అక్షరటుడే’లో చీఫ్​ సబ్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, స్థానికం, జనరల్​, క్రైం, వైరల్​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
2 Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *