Telangana Teacher Meals | తెలంగాణ ఈ-కేబినెట్ కీలక నిర్ణయం

తెలంగాణ రాష్ట్రంలో విద్యా రంగానికి సంబంధించి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలోని ప్రభుత్వం చారిత్రాత్మక నిర్ణయం తీసుకుంది.

Shivam nagarani

అక్షరటుడే వెబ్‌డెస్క్: Telangana Teacher Meals | తెలంగాణ రాష్ట్రంలో విద్యా రంగానికి సంబంధించి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ( Revanth Reddy )నేతృత్వంలోని ప్రభుత్వం చారిత్రాత్మక నిర్ణయం తీసుకుంది. సచివాలయంలో జరిగిన తొలి ‘ఈ-కేబినెట్’ సమావేశంలో, రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ పాఠశాలలు , జూనియర్ కళాశాలల్లో పనిచేసే ఉపాధ్యాయులు, లెక్చరర్లు, , ఇతర నాన్-టీచింగ్ సిబ్బంది అందరికీ ఉచిత అల్పాహారం, మధ్యాహ్న భోజనాన్ని అందించాలని మంత్రివర్గం తీర్మానించింది.

telangana

Telangana Teacher Meals | విధుల పట్ల మరింత నిబద్ధతతో ..

ప్రస్తుతం ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు మాత్రమే మధ్యాహ్న భోజనం అందుబాటులో ఉంది. అయితే, ఇకపై ఈ సదుపాయాన్ని సిబ్బందికి కూడా విస్తరించడం ద్వారా ఉపాధ్యాయులు పాఠశాలల్లో ఎక్కువ సమయం గడపడానికి, అలాగే విధుల పట్ల మరింత నిబద్ధతతో అందుబాటులో ఉండటానికి వీలు కలుగుతుందని ప్రభుత్వం భావిస్తోంది.

ఈ నిర్ణయం వల్ల సిబ్బందికి ఎంతో మేలు జరుగుతుందని భావిస్తున్న విద్యావేత్తలు, ఉపాధ్యాయ సంఘాలు , విద్యా రంగ నిపుణులు ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంపై హర్షం వ్యక్తం చేస్తున్నారు.

ఇది కూడా చదవండి:  Supreme Court AI | న్యాయవ్యవస్థలో ఏఐ వాడకం.. నకిలీ తీర్పుల వినియోగంపై సుప్రీంకోర్టు ఆగ్రహం

Follow:
Author Bio: శివం నాగరాణి గత 5 సంవత్సరాలుగా తెలుగు వార్తా రంగంలో పనిచేస్తున్నారు. కందిలి దినపత్రికలో జర్నలిస్ట్‌గా పని చేశారు. ప్రస్తుతం అక్షర టుడే వెబ్‌సైట్‌లో లైఫ్‌స్టైల్, ఆధ్యాత్మికం, ఆరోగ్యం, విద్య, ఉద్యోగాలు, ప్రభుత్వ పథకాలు, బిజినెస్, పర్సనల్ ఫైనాన్స్‌వంటి అంశాలపై వార్తలను అందిస్తున్నారు.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *