అక్షరటుడే, వెబ్డెస్క్ : Police Jobs Telangana | రాష్ట్రంలో 20 వేల పోలీస్ ఉద్యోగాలు భర్తీ చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ బహిరంగ లేఖ రాశారు. పోలీస్ ఉద్యోగాలకు పోటీ పడే యువత ఎక్కువ శాతం పేద మధ్యతరగతి గ్రామీణ వర్గాలే ఎక్కువ అని పేర్కొన్నారు.
ఎన్నో కష్టాలు పడుతూ హైదరాబాద్‌లో రేయింబవళ్లు కష్టపడి పోటీలకు సన్నద్ధమవుతున్నారని, వారి ఆశలపైన నీళ్లు చల్లొదన్నారు. నియామకాల విషయంలో కాంగ్రెస్ తీవ్రమైన అన్యాయం చేస్తుందని పేర్కొన్నారు. 17 వేల పోస్టులు ఖాళీ ఉన్నాయని ప్రభుత్వమే చెప్పినా ఇప్పటిదాకా భర్తీ మాత్రం చేయడం లేదని మండిపడ్డారు. బీఆర్ఎస్ హయాంలో ఎలాంటి హామీ ఇవ్వకున్నా 47 వేల పోలీసు ఉద్యోగాలు భర్తీ చేశామన్నారు.
Police Jobs Telangana | హామీలు ఇచ్చి..
ఎన్నికల ముందు యువతకు డిక్లరేషన్ పేరిట హామీలు ఇచ్చి ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం మోసం చేస్తోందన్నారు. సంవత్సరంలోనే రెండు లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ అని.. 17,000 ప్రభుత్వ ఉద్యోగాలు మాత్రమే ఇప్పటిదాకా ఇచ్చిందన్నారు. కాంగ్రెస్ పార్టీపై రాష్ట్రంలోని యువత తీవ్ర ఆగ్రహంతో ఉన్నారని కేటీఈఆర్ పేర్కొన్నారు. వారికి ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు.
వెంటనే 20,000 కానిస్టేబుల్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేయాలి.
పోలీస్ కానిస్టేబుల్, ఎస్సై ఆశావహుల డిమాండ్లు, తెలంగాణ రాష్ట్రంలో నిరుద్యోగులకు జరుగుతున్న అన్యాయం, నిరుద్యోగులను వంచించబడ్డ తీరుపై సీఎం రేవంత్ కు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ @KTRBRS బహిరంగ లేఖ ✍️ pic.twitter.com/f3pweVkjlF
— BRS Party (@BRSparty) July 3, 2026
ఇది కూడా చదవండి : Scanning Centre Fraud | స్కానింగ్ సెంటర్లో రూ.లక్షలు కాజేసిన ఉద్యోగులు.. ఒకరి అరెస్ట్