అక్షరటుడే, వెబ్‌డెస్క్: Telangana Police Recruitment | రాష్ట్రంలోని నిరుద్యోగులకు ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. పోలీస్ శాఖ (Police Department)లో 5 వేల ఉద్యోగాలను భర్తీ చేయడానికి ఆమోదం తెలిపింది. దీంతో రెండు మూడు రోజుల్లో నోటిఫికేషన్ వెలువడే అవకాశం ఉంది.
రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం (Congress Government) వచ్చిన తర్వాత పోలీస్ ఉద్యోగాలు భర్తీ చేయలేదు. దీంతో అభ్యర్థులు ఎంతో ఆశగా కొలువుల కోసం సిద్ధం అవుతున్నారు. ఈ క్రమంలో ప్రభుత్వం తాజాగా 5 వేల పోస్టుల భర్తీకి ఆమోదం తెలిపింది. అర్హతలు, వయోపరిమితులు, ఎంపిక విధానం, పరీక్షల షెడ్యూల్‌ను త్వరలో విడుదల చేయనుంది. రెండో విడతలో మరో రెండు వేల కొలువులను భర్తీ చేస్తామని ప్రభుత్వం తెలిపింది.
Telangana Police Recruitment | పోస్టుల వివరాలు..
ప్రభుత్వం భర్తీ చేయనున్న పోలీస్ కొలువుల్లో సివిల్ కానిస్టేబుల్ 3,697, ఆర్మ్డ్ రిజర్వ్ కానిస్టేబుల్ 1,052, సబ్ఇన్స్పెక్టర్ (సివిల్)-148, సబ్ఇన్స్పెక్టర్ (ఏఆర్)-14, రిజర్వ్ సబ్ ఇన్స్పెక్టర్ (టీజీఎస్పీ) – 12 పోస్టులు ఉన్నాయి. సబ్ ఇన్స్పెక్టర్ (ఏఆర్ సీపీఎల్) – 3, అసిస్టెంట్ సబ్ఇన్స్పెక్టర్ (ఎఫ్‌పీబీ) – 23, పోలీసు కానిస్టేబుల్ (ఎస్ఏఆర్ సీపీఎల్) – 24, పోలీసు కానిస్టేబుల్ (డ్రైవర్-పీటీవో) – 20, మెకానిక్ పీటీవో – 7 పోస్టులను భర్తీ చేస్తామని తెలిపింది. స్పీఎఫ్, జైళ్లశాఖ, అగ్నిమాపక శాఖలకు సంబంధించి మరో 2 వేల పోస్టుల భర్తీకి త్వరలో ఆమోదం తెలపనుంది.
Telangana Police Recruitment | వీటిని మర్చిపోవద్దు

దాదాపుగా 4 ఏళ్ల తర్వాత పోలీస్ శాఖలో కొలువులు భర్తీ చేయనుండటంతో లక్షలాది మంది దరఖాస్తు చేసుకునే అవకాశం ఉంది. అయితే అభ్యర్థులు పలు జాగ్రత్తలు పాటించాలని నిపుణులు చెబుతున్నారు. అభ్యర్థుల్లో కొంతమంది పూర్తిగా ఫిజికల్ టెస్ట్‌లపై ఫోకస్ పెడుతుండగా.. కొందరు రాత పరీక్షపై దృష్టి సారిస్తున్నారు. మొదట ప్రిలిమినరీ పరీక్ష ఉంటుంది. అనంతరం ఫిజికల్ టెస్ట్, అందులో ఉత్తీర్ణత సాధించిన వారికి మెయిన్స్ పరీక్ష నిర్వహిస్తారు. అయితే చాలా మంది అభ్యర్థులు ఫిజికల్ టెస్ట్‌ల్లో ఫెయిల్ అవుతుంటారు. ఈ క్రమంలో ఇప్పటి నుంచే సాధన చేయాలని నిపుణులు సూచిస్తున్నారు. పౌష్టికాహారం తీసుకుంటూ నిత్యం ప్రాక్టీస్ చేస్తే ఫిజికల్ టెస్ట్‌లో విజయం సాధించవచ్చని చెబుతున్నారు.
ఇది కూడా చదవండి..: Kavitha Party Name | కవిత పార్టీకి ఈసీ షాక్.. పేరు మార్చుకోవాలని లేఖ