అక్షరటుడే, నిజామాబాద్ క్రైం: Basara DIG Review | నేరాల నియంత్రణ కోసం కృషి చేయాలని..నిఘా వ్యవస్థను పటిష్టపర్చాలని బాసర జోన్–2 డీఐజీ భాస్కరన్ (Basara DIG, Bhaskaran) అన్నారు. నగరంలోని సీపీ కార్యాలయంలో (CP Office) నిజామాబాద్ (Nizamabad), నిర్మల్(Nirmal), ఆదిలాబాద్(Adilabad), జగిత్యాల జిల్లాస్థాయి అధికారులతో కలిసి సమీక్ష నిర్వహించారు.
Basara DIG Review | అన్ని అంశాలపై..
డీఐజీ మాట్లాడుతూ.. జిల్లాల శాంతిభద్రతల పరిస్థితి, నేర నియంత్రణ, ప్రజలకు అందుతున్న పోలీసు సేవలు, పెండింగ్ కేసుల దర్యాప్తుపై వివరాలు తెలుసుకున్నారు. మహిళలు, చిన్నారుల భద్రత, సైబర్ నేరాల నియంత్రణ, ట్రాఫిక్ నిర్వహణ, మాదక ద్రవ్యాల నిర్మూలన, కమ్యూనిటీ పోలీసింగ్ కార్యక్రమాల అమలు తదితర అంశాలపై విస్తృతంగా సమీక్షించారు. జిల్లా వారీగా నమోదవుతున్న నేరాల తీరు, వాటి విచారణలో సాధించిన పురోగతి, నేరస్తులపై తీసుకుంటున్న చర్యలు, వారెంట్ల అమలుపై అధికారులు ద్వారా వివరాలు తెలుసుకున్నారు.
Basara DIG Review | ఫిర్యాదులు పరిష్కరించాలి
రౌడీ షీటర్లు, హిస్టరీ షీటర్ల పర్యవేక్షణ, శాంతిభద్రతలకు భంగం కలిగించే అంశాలపై ప్రత్యేకంగా డీజీపీ చర్చించారు. ప్రజల ఫిర్యాదులను సకాలంలో స్వీకరించి, పారదర్శకంగా విచారణ జరిపి త్వరితగతిన పరిష్కరించాలని అధికారులకు సూచించారు. సాంకేతిక పరిజ్ఞానాన్ని సమర్థవంతంగా వినియోగించి సైబర్ నేరాలను అరికట్టాలని, మహిళలు, చిన్నారులపై జరిగే నేరాల కేసుల్లో వేగవంతమైన దర్యాప్తు చేపట్టి బాధితులకు న్యాయం జరిగేలా చూడాలని ఆదేశించారు. మాదక ద్రవ్యాల అక్రమ రవాణా, విక్రయాలు, వినియోగంపై కఠిన చర్యలు తీసుకోవడంతో పాటు యువతలో అవగాహన కార్యక్రమాలను విస్తృతంగా నిర్వహించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో సీపీ సాయి చైతన్య, నిర్మల్ ఎస్పీ జానకి షర్మిల, ఆదిలాబాద్ ఎస్పీ అఖిల్ మహాజన్, జగిత్యాల్ ఎస్పీ అశోక్ కుమార్, అదనపు ఎస్పీలు, ఏసీపీలు, సీఐలు, రిజర్వ్ విభాగం అధికారులు పాల్గొన్నారు.
ఇది కూడా చదవండి: సిద్దిపేట జిల్లాలో హరీష్ రావు, విజయ్ దేవరకొండ