Lucky Draw Scam | లక్కీడ్రా ద్వారా భూమి అమ్మకానికి యత్నం.. కేసు నమోదు చేసిన పోలీసులు

లక్కీడ్రా ద్వారా భూమి విక్రయిస్తానని సోషల్ మీడియాలో ప్రచారం చేసిన వ్యక్తిపై సదాశివనగర్ పోలీసులు కేసు నమోదు చేశారు.

shashi kiran Mottala

అక్షరటుడే, కామారెడ్డి : Lucky Draw Scam | లక్కీడ్రా ద్వారా భూమి విక్రయిస్తానని సోషల్ మీడియాలో ప్రచారం చేసిన వ్యక్తిపై సదాశివనగర్ పోలీసులు (Sadashivanagar) కేసు నమోదు చేశారు. ఈ మేరకు శనివారం వివరాలు వెల్లడించారు.

Lucky Draw Scam | 19 గుంటల భూమి..

సదాశివనగర్ మండల కేంద్రానికి చెందిన సింగరాయపల్లి రమేష్ తనకు సర్వే నెం.108/1/2లో ఉన్న 19 గుంటల పట్టా భూమిని లక్కీడ్రా ద్వారా విక్రయిస్తానని చెబుతూ ఒక్కో వ్యక్తి నుంచి రూ.999 వసూలు చేసి రశీదులు జారీ చేస్తున్నట్లు పోలీసులకు సమాచారం చేరింది. రంగంలోకి దిగిన సదాశివనగర్ ఎస్సై పుష్పరాజ్ సిబ్బందితో కలిసి తనిఖీలు చేయగా, ఎలాంటి ప్రభుత్వ అనుమతులు లేకుండానే లక్కీడ్రా స్కీం నిర్వహిస్తున్నట్లు గుర్తించారు. అనుమతి పత్రాలు చూపాలని కోరగా అవి లేవని రమేష్ అంగీకరించాడు.

దీంతో పోలీసులు లక్కీడ్రాకు సంబంధించిన 6 పుస్తకాలు, ఒక సెల్‌ఫోన్‌ను స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. రూ.999 చెల్లిస్తే భూమి వస్తుందని, చిన్న పెట్టుబడితో భారీ లాభాలు అని చెప్పే అనుమతి లేని లక్కీడ్రాలు, స్కీమ్​లు అన్నీ చట్టవిరుద్ధమని ఎస్పీ హెచ్చరించారు. ఇలాంటి మోసపూరిత ప్రచారాలను ప్రజలు నమ్మవద్దని, డబ్బు చెల్లించే ముందు తప్పనిసరిగా ప్రభుత్వ అనుమతులు ఉన్నాయో లేదో పరిశీలించాలని సూచించారు. అలాగే ఇలాంటి కార్యకలాపాలు గమనిస్తే వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని కోరారు.

ఇది కూడా చదవండి : భారత జట్టులోకి వైభవ్ సూర్యవంశీ ఎంట్రీ 

తెలుగు జర్నలిజంలో 20 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2005లో ‘వార్త’ దినపత్రికలో స్పోర్ట్స్​ రిపోర్టర్​గా పనిచేశాను. అనంతరం రెండేళ్ల పాటు సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. 2010లో ‘సాక్షి’ జర్నలిజం స్కూల్​లో శిక్షణ పొందాను. అనంతరం ‘సాక్షి’ దినపత్రికలో సబ్​ఎడిటర్​గా చేరాను. సీనియర్​ సబ్​ ఎడిటర్​గా ప్రమోషన్​ పొందాను. 2024 నవంబర్​ నుంచి ‘అక్షరటుడే’లో చీఫ్​ సబ్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, స్థానికం, జనరల్​, క్రైం, వైరల్​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *