అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Food Adulteration Action | ఆహార పదార్థాలను కల్తీ చేసే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు (CS Sanjay Jaju) ఆదేశించారు. రాష్ట్రవ్యాప్తంగా ఆహార భద్రతా నిబంధనలను కఠినంగా అమలు చేయాలన్నారు. కల్తీ ఆహార ఉత్పత్తులపై ప్రత్యేక దృష్టి సారించి నిరంతరం తనిఖీలు నిర్వహించాలని సూచించారు.
సచివాలయంలో సీనియర్ అధికారులతో శనివారం ఆయన ఫుడ్ సేఫ్టీపై సమీక్ష నిర్వహించారు. డ్రగ్ కంట్రోల్, ఆహార భద్రత శాఖలు పరస్పర సమన్వయంతో పనిచేయాలని, ప్రజలకు సురక్షితమైన ఆహారం అందుబాటులో ఉండేలా చూడాలన్నారు. మెరుగైన సమన్వయం, పనితీరు కోసం ప్రస్తుతం విడివిడిగా ఉన్న ఈ రెండు శాఖలను ఒకే వేదికపైకి తీసుకువచ్చేలా తగిన ప్రతిపాదనలను వారం రోజుల్లో సిద్ధం చేయాలని ఆదేశించారు.
Food Adulteration Action | కేసులపై ఆరా..
ఇతర రాష్ట్రాల్లో అనుసరిస్తున్న ఉత్తమ విధానాలను అధ్యయనం చేసి, మన రాష్ట్రానికి తగిన అమలు ప్రణాళికను రూపొందించాలని సీఎస్ సూచించారు. రాష్ట్రంలో ఇప్పటివరకు నమోదైన కేసులు, వాటి పురోగతి, సిబ్బంది వివరాలపై ఆయన ఆరా తీశారు. ఈ సమావేశంలో ముఖ్యమంత్రి సలహాదారు కె. రామకృష్ణారావు, డీజీపీ సీవీ ఆనంద్, సీఎంఓ ముఖ్య కార్యదర్శులు శేషాద్రి, ఎన్. శ్రీధర్, జీఏడీ (GAD) ముఖ్య కార్యదర్శి అహ్మద్ నదీమ్, అదనపు డీజీ (ఇంటెలిజెన్స్) విజయ్ కుమార్, ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి క్రిస్టీనా జెడ్ చోంగ్తు, జీహెచ్ఎంసీ (GHMC) కమిషనర్ ఆర్.వి. కర్ణన్ పాల్గొన్నారు.
దీనిని కూడా చదవండి : KCR Farmhouses | కేసీఆర్ కుటుంబానికి ఫామ్‌హౌజ్‌లు ఎక్కడివి : సీఎం రేవంత్‌రెడ్డి