KTR Kannepalli Tour | కన్నెపల్లి పంప్‌హౌస్‌కు చేరుకున్న కేటీఆర్ బృందం

కాంగ్రెస్ ప్రభుత్వం విధించిన ఆంక్షలను ధిక్కరిస్తూ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కన్నెపల్లి పంప్‌హౌస్‌కు చేరుకున్నారు.

Shivam nagarani

అక్షరటుడే వెబ్‌డెస్క్: KTR Kannepalli Tour | కాంగ్రెస్ ప్రభుత్వం విధించిన ఆంక్షలను ధిక్కరిస్తూ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కన్నెపల్లి పంప్‌హౌస్‌కు చేరుకున్నారు. పార్టీ ముఖ్య నేతలు, వేలాది మంది కార్యకర్తలతో కలిసి ఆయన కాళేశ్వరం ప్రాజెక్టును క్షేత్రస్థాయిలో పరిశీలించారు. కేటీఆర్ పర్యటనను అడ్డుకునేందుకు ప్రభుత్వం భారీగా పోలీసులను మోహరించి, రహదారులపై బారికేడ్లను ఏర్పాటు చేసింది. అయినప్పటికీ, కేటీఆర్‌తో పాటు మాజీ మంత్రులు జగదీష్ రెడ్డి, గంగుల కమలాకర్, సత్యవతి రాథోడ్, కొప్పుల ఈశ్వర్, ఎంపీ వద్దిరాజు రవిచంద్ర, ఎమ్మెల్యేలు పల్లా రాజేశ్వర్ రెడ్డి, పాడి కౌశిక్ రెడ్డి , పలువురు మాజీ ఎమ్మెల్యేలు, నాయకులు బారికేడ్లను తొలగించి ముందుకు కదిలారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్ని ప్రయత్నాలు చేసినా కార్యకర్తల ఉత్సాహం ముందు అవి నిలవలేదని పార్టీ వర్గాలు తెలిపాయి.

KTR Kannepalli Tour | భారీగా తరలివచ్చిన నేతలు, కార్యకర్తలు..

ఈ కార్యక్రమంలో శాసనమండలి ప్రతిపక్ష నేత మధుసూదనాచారి, బోయినపల్లి వినోద్ కుమార్, మాలోత్ కవిత, బాల్క సుమన్, పుట్ట మధు, రసమయి బాలకిషన్, గొంగిడి సునీతా మహేందర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. కేటీఆర్ వెంట పార్టీకి చెందిన ముఖ్య నాయకులు, మాజీ కార్పొరేషన్ చైర్మన్లు, సీనియర్ నేతలు , వేలాది మంది బీఆర్ఎస్ శ్రేణులు కాళేశ్వరానికి తరలిరావడంతో అక్కడ ఉద్రిక్తతతో కూడిన వాతావరణం నెలకొంది.

kannepalli.1

KTR Kannepalli Tour | ప్రభుత్వ వైఖరిపై నిరసన..

ప్రతిపక్షం ప్రాజెక్టును సందర్శించకుండా ప్రభుత్వం నిర్బంధాన్ని ప్రయోగించడంపై బీఆర్ఎస్ నేతలు తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. ప్రజా క్షేత్రంలో వాస్తవాలను వెల్లడించకుండా అడ్డుకోవడం ప్రభుత్వ అసమర్థతకు నిదర్శనమని వారు విమర్శించారు. ప్రభుత్వం ఎన్ని అడ్డంకులు సృష్టించినా, ప్రాజెక్టుల వాస్తవ పరిస్థితిని ప్రజల ముందు ఉంచడమే తమ లక్ష్యమని కేటీఆర్ బృందం స్పష్టం చేసింది.


ఇది కూడా చదవండి:  Hormuz Transit Fee | ఇరాన్ కీలక నిర్ణయం.. హర్మూజ్‌లో నౌకల ప్రయాణానికి ఇక ఛార్జీలు వసూలు

Follow:
Author Bio: శివం నాగరాణి గత 5 సంవత్సరాలుగా తెలుగు వార్తా రంగంలో పనిచేస్తున్నారు. కందిలి దినపత్రికలో జర్నలిస్ట్‌గా పని చేశారు. ప్రస్తుతం అక్షర టుడే వెబ్‌సైట్‌లో లైఫ్‌స్టైల్, ఆధ్యాత్మికం, ఆరోగ్యం, విద్య, ఉద్యోగాలు, ప్రభుత్వ పథకాలు, బిజినెస్, పర్సనల్ ఫైనాన్స్‌వంటి అంశాలపై వార్తలను అందిస్తున్నారు.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *