Telangana Tourism | పురానాపూల్ బ్రిడ్జి ఇక పర్యాటక జోన్.. సీఎం రేవంత్ కీలక ప్రణాళిక

తెలంగాణ రాష్ట్రంలోని పర్యాటక రంగ అభివృద్ధిపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సోమవారం ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు.

Shivam nagarani

అక్షరటుడే వెబ్‌డెస్క్: Telangana Tourism | తెలంగాణ రాష్ట్రంలోని పర్యాటక రంగ అభివృద్ధిపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ( Revanth Reddy ) సోమవారం ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. దుర్గం చెరువు, తారామతి బారామతి వంటి ప్రాచుర్యం పొందిన ప్రాంతాలను ఆధునీకరించడంతో పాటు, కొత్తగా ఎకో టూరిజం పార్కులు, వికారాబాద్ అభివృద్ధి, , పురానాపూల్ హెరిటేజ్ బ్రిడ్జిని పర్యాటక జోన్‌గా మార్చడంపై సీఎం స్పష్టమైన దిశానిర్దేశం చేశారు.

Telangana Tourism | చారిత్రక కట్టడాల ఆధునీకరణ..

రాష్ట్రంలోని ప్రముఖ పర్యాటక ప్రాంతాలకు కొత్త కళ తీసుకురావాలని సీఎం ఆదేశించారు. తారామతి బారామతిని మరింత ఆకర్షణీయంగా తీర్చిదిద్దడంతో పాటు, దుర్గం చెరువును పూర్తిస్థాయి పర్యాటక ప్రాంతంగా అభివృద్ధి చేయాలని సూచించారు. వీటితో పాటు మంజీరా, దిల్‍కుషా గెస్ట్ హౌస్‌లను ఆధునిక వసతులతో ఆధునీకరించాలని స్పష్టం చేశారు.

revanth.1 1

Telangana Tourism | ఎకో టూరిజం & ఫ్యూచర్ సిటీ..

ప్రకృతిని పర్యాటకంతో అనుసంధానించడమే లక్ష్యంగా అడుగులు పడుతున్నాయి. ‘క్యూర్’ (QUR) పరిధిలోని అటవీ భూములను పర్యాటక శాఖతో సమన్వయం చేసుకుంటూ ‘ఎకో టూరిజం’ కేంద్రాలుగా మార్చాలని సీఎం ఆదేశించారు. గుర్రంగూడ ఎకో పార్క్ తరహాలో మరిన్ని పార్కులను ఏర్పాటు చేయడమే కాకుండా, ప్రతిష్టాత్మక ‘ఫ్యూచర్ సిటీ’లోని అటవీ భూములను అంతర్జాతీయ ప్రమాణాలతో అభివృద్ధి చేయాలని, ఈ ప్రాజెక్టుల పర్యవేక్షణకు ప్రత్యేక అధికారిని నియమించాలని సూచించారు. ‘టూరిజం హబ్ డెవలప్‌మెంట్’ పథకం కింద వికారాబాద్‌ను పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దనున్నారు. ముఖ్యంగా అక్కడ ఉన్న వీరభద్రస్వామి ఆలయాన్ని యాదగిరిగుట్ట తరహాలో అద్భుతంగా అభివృద్ధి చేయాలని, ఇందుకోసం ఒక ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు.

Telangana Tourism | పురానాపూల్ బ్రిడ్జి..

పాతబస్తీలోని చారిత్రక పురానాపూల్ హెరిటేజ్ బ్రిడ్జిని పర్యాటక ప్రాంతంగా మార్చేందుకు ప్రణాళికలు సిద్ధమవుతున్నాయి. పర్యాటకుల కోసం అక్కడ ప్రత్యేక సౌకర్యాలు కల్పించాలని, అవసరమైతే బ్రిడ్జిపై ట్రాఫిక్‌ను మళ్లించి దాన్ని పూర్తి స్థాయి పర్యాటక జోన్‌గా మార్చే అవకాశాలను పరిశీలించాలని సీఎం సూచించారు. ఈ సంవత్సరం డిసెంబరులో నిర్వహించనున్న ‘గ్లోబల్ ఇన్వెస్ట్‌మెంట్ సమ్మిట్’ను అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించాలని సీఎం ఆదేశించారు. ఈ మెగా సమ్మిట్ విజయవంతం కావడానికి వివిధ ప్రభుత్వ శాఖల మధ్య సమన్వయం అవసరమని, ఇందుకోసం ప్రత్యేక కమిటీలను ఏర్పాటు చేయాలని ఆయన సూచించారు.

ఇది కూడా చదవండి:  Jammu Kashmir Cloudburst | జమ్మూ కశ్మీర్​లో క్లౌడ్​బరస్ట్​.. విరిగి పడిన కొండచరియలు

Follow:
Author Bio: శివం నాగరాణి గత 5 సంవత్సరాలుగా తెలుగు వార్తా రంగంలో పనిచేస్తున్నారు. కందిలి దినపత్రికలో జర్నలిస్ట్‌గా పని చేశారు. ప్రస్తుతం అక్షర టుడే వెబ్‌సైట్‌లో లైఫ్‌స్టైల్, ఆధ్యాత్మికం, ఆరోగ్యం, విద్య, ఉద్యోగాలు, ప్రభుత్వ పథకాలు, బిజినెస్, పర్సనల్ ఫైనాన్స్‌వంటి అంశాలపై వార్తలను అందిస్తున్నారు.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *