అక్షరటుడే, వెబ్‌డెస్క్: ABVP 78th Foundation Day | అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ (ఏబీవీపీ) 78వ ఆవిర్భావ దినోత్సవం, జాతీయ విద్యార్థి దినోత్సవం సందర్భంగా హైదరాబాద్‌లోని కేపీహెచ్‌బీ ప్రాంతంలో భారీ విద్యార్థి ర్యాలీతో పాటు జెండా ఆవిష్కరణ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో ఎబీవీపీ నాయకులు ఆత్మకూరి శ్రీనాథ్, కేపీహెచ్‌బీ నగర కార్యదర్శి ఆకాష్ సింగ్, సంయుక్త కార్యదర్శి దాగుబాటి శంకర్‌తో పాటు పలువురు కార్యకర్తలు, విద్యార్థులు పాల్గొన్నారు.
IAS Officer Y. Srilaxmi | శిఖరం నుంచి పతనం.. మళ్లీ బాధ్యతల వైపు : వై. శ్రీలక్ష్మి పరిపాలనా ప్రయాణం
ABVP 78th Foundation Day | సమాజ సేవలో ముందుండాలి
ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ.. విద్యార్థుల్లో జాతీయ భావన, సామాజిక బాధ్యత, నాయకత్వ లక్షణాల పెంపొందింపే ఏబీవీపీ ప్రధాన లక్ష్యమని పేర్కొన్నారు. అనంతరం విద్యార్థులందరికీ జాతీయ విద్యార్థి దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ, విద్యార్థులు విద్యతో పాటు సమాజ సేవలోనూ ముందుండాలని ఆకాంక్షించారు.
ర్యాలీ అనంతరం జెండా ఆవిష్కరణ కార్యక్రమం నిర్వహించి, దేశాభివృద్ధిలో యువత పాత్ర కీలకమని నాయకులు పేర్కొన్నారు.
Hyderabad Water Crisis | ఐటీ హబ్‌ల తళతళల వెనుక ‘జల’ సంక్షోభం: భాగ్యనగరంలో పాతాళంలోకి భూగర్భ జలాలు!