Bollaram Fire Accident | బొల్లారంలో భారీ అగ్ని ప్రమాదం

సంగారెడ్డి జిల్లా బొల్లారంలో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. పరుపుల గోదాంలో శనివారం రాత్రి ఒక్కసారిగా మంటలు చెలరేగాయి.

Srinivas Kolluri

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Bollaram Fire Accident | సంగారెడ్డి (Sangareddy) జిల్లా బొల్లారంలో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. ఇండస్ట్రియల్ ఏరియాలోని పరుపుల గోదాంలో శనివారం రాత్రి ఒక్కసారిగా మంటలు చెలరేగాయి.

బొల్లారం పారిశ్రామిక వాడలో శనివారం రాత్రి ‘సెంచురీ మ్యాట్రెస్’ (Centuary mattress) గిడ్డంగిలో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. మంటలు చెలరేగి క్షణాల్లోనే వ్యాపించాయి. పరుపులు ఉండటంతో మంటలు వేగంగా వ్యాపించాయి. దీంతో స్థానికులు భయాందోళనకు గురి అయ్యారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది వెంటనే ఘటన స్థలానికి చేరుకున్నారు. ఫైరింజన్ల సాయంతో మంటలు ఆర్పి వేశారు. ఈ ప్రమాదంలో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు. అయితే భారీ ఎత్తున ఆస్తి నష్టం వాటిల్లింది. అయితే అగ్ని ప్రమాదానికి గల కారణాలు తెలియరాలేదు.

Bollaram Fire Accident | వరుస ప్రమాదాలు

హైదరాబాద్​ (Hyderabad) నగరంలో ఇటీవల అగ్ని ప్రమాదాలు ఆందోళన కలిగిస్తున్నాయి. కొన్ని రోజుల క్రితం ఉప్పల్​లోని పరుపుల గోడౌన్ లో అగ్నిప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో భారీగా ఆస్తినష్టం జరిగింది. గతంలో పలు ఫర్నిచర్​ దుకాణాలు కాలి బుడిద అయ్యాయి. పరుపులు, ఫర్నిచర్​ దుకాణాల్లో మంటలు అంటుకుంటే తీవ్రత ఎక్కువగా ఉంటుంది. పారిశ్రామిక వాడల్లో సైతం ఇటీవల ప్రమాదాలు పెరిగాయి. దీంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు. అగ్ని ప్రమాదాల నియంత్రణకు చర్యలు చేపట్టాలని కోరుతున్నారు.

ఇది కూడా చదవండి : S Janaki Passing | గానకోకిల ఎస్. జానకి అమరగానం..ఏడు దశాబ్దాల సంగీత ప్రస్థానం ముగింపు

తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *