అక్షరటుడే వెబ్డెస్క్: Polavaram Banakacherla Link | పోలవరం – బనకచర్ల లింక్ ప్రాజెక్టు విషయంలో రాష్ట్ర ప్రభుత్వం అనుసరిస్తున్న తీరుపై టీఆర్ఎస్ అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత అత్యంత తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. తన రాజకీయ ప్రయోజనాల కోసం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాష్ట్ర నీటి హక్కులను తాకట్టు పెడుతున్నారని ఆమె సంచలన ఆరోపణలు చేశారు. ఈ మేరకు ఆమె ‘X’ (ట్విట్టర్) వేదికగా రాష్ట్ర ప్రభుత్వంపై ప్రశ్నల వర్షం కురిపించారు.
Polavaram Banakacherla Link | ములాఖత్ రాజకీయాలు ఎందుకు?
ఏపీ ప్రభుత్వం చేపడుతున్న అక్రమ ప్రాజెక్టును అడ్డుకోవాల్సిన తెలంగాణ ప్రభుత్వం, తెరచాటున వారికి సహకరిస్తోందని కవిత ఆరోపించారు. రేవంత్ రెడ్డికి తెలంగాణ నీటి హక్కుల పట్ల కనీస సోయి లేదని ఆమె దుయ్యబట్టారు. సుప్రీంకోర్టులో ప్రభుత్వం వేసిన పిటిషన్ అత్యంత బలహీనంగా ఉండటం వల్లే, ఏపీకి కనీసం నోటీసులు ఇచ్చేందుకు కూడా కోర్టు నిరాకరించిందని ఆమె గుర్తు చేశారు. లోపభూయిష్టమైన పిటిషన్ దాఖలు చేయడం వెనుక ఉన్న మతలబు ఏంటని ఆమె ప్రశ్నించారు. తన వ్యక్తిగత రాజకీయ లబ్ధి కోసం, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రికి ‘గురుదక్షిణ’గా మన గోదావరి నీళ్లను రాసిచ్చేందుకే ఇలాంటి బలహీనమైన పిటిషన్ దాఖలు చేశారని ఆమె ఘాటుగా విమర్శించారు.
Polavaram Banakacherla Link | ప్రభుత్వానికి కవిత వార్నింగ్..
ఇప్పటికైనా ప్రభుత్వం కళ్లు తెరిచి, పోలవరం – బనకచర్ల లింక్ ప్రాజెక్టుపై లోపాలు లేని అత్యంత పటిష్టమైన పిటిషన్ను సుప్రీంకోర్టులో దాఖలు చేయాలని కవిత డిమాండ్ చేశారు. ఒకవేళ కాంగ్రెస్ ప్రభుత్వం ఈ అక్రమ ప్రాజెక్టును న్యాయపరంగా అడ్డుకోవడంలో విఫలమైతే, తెలంగాణ గడ్డ , ఇక్కడి ప్రజలు ఈ ప్రభుత్వాన్ని, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఎన్నటికీ క్షమించరని ఆమె హెచ్చరించారు.
గోదావరిలో తెలంగాణ నీటి హక్కులను సీఎం రేవంత్ రెడ్డి కాలరాస్తున్నారని తెలంగాణ రక్షణ సేన చీఫ్ కల్వకుంట్ల కవిత ఆవేదన వ్యక్తం చేశారు. పోలవరం- బనకచర్ల లింక్ ప్రాజెక్టుకు తెరచాటుగా ఏపీకి రేవంత్ రెడ్డి సహకరిస్తున్నారని మండిపడ్డారు. పోలవరం – బనకచర్ల ప్రాజెక్టుపై తెలంగాణ ప్రభుత్వం వేసిన…
— Telangana Rakshana Sena (@TRSparty_HQ) July 13, 2026
ఇది కూడా చదవండి: Temple Hundi Security | ఆలయ హుండీలకు ‘డిజిటల్’ భద్రత.. కర్ణాటక ప్రభుత్వ కొత్త నిబంధనలు