Shabad Murder Case | రాజ్​కుమార్​ మృతదేహం తీసుకెళ్లని కుటుంబ సభ్యులు.. అనాథల అంత్యక్రియలు

షాబాద్​ హత్యల కేసులో నిందితుడు రాజ్​కుమార్​ మృతదేహాన్ని తీసుకు వెళ్లడానికి కుటుంబ సభ్యులు నిరాకరించారు. దీంతో మున్సిపల్ సిబ్బంది సహకారంతో పోలీసులు అంత్యక్రియలు చేశారు.

Srinivas Kolluri

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Shabad Murder Case | రంగారెడ్డి జిల్లా (Ranga Reddy District) షాబాద్​ మండలం దైవాలగూడలో ఆరు హత్యలు చేసిన రాజ్​కుమార్ అంత్యక్రియలు పూర్తయ్యాయి. అతడి కుటుంబ సభ్యులు మృతదేహం తీసుకు వెళ్లడానికి నిరాకరించారు. దీంతో మున్సిపల్ సిబ్బంది అనాథ శవంలా అంత్యక్రియలు చేశారు.

తనపై పోక్సో కేసు పెట్టారని పగతో ఓ బాలికను ఆమె తల్లి, నాయనమ్మను రాజ్​కుమార్​ హత్య చేసిన విషయం తెలిసిందే. అంతేగాకుండా తన భార్య పిల్లలను సైతం చంపేశాడు. అనంతరం నిందితుడు పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. సోమవారం సాయంత్రం అతడి మృతదేహాన్ని చేవేళ్ల ఆస్పత్రికి తరలించారు.

Shabad Murder Case | ముందుకురాని డాక్టర్లు

రాజ్​ఉకమార్​ పోస్టుమార్టంలో మూడు గంటల జాప్యం జరిగింది.డ్యూటీలో ఉన్న వైద్యురాలు పోస్టుమార్టం చేసేందుకు ముందుకు రాకపోవడంతో మూడు గంటల పాటు నిలిచిపోయింది. చేవెళ్ల ప్రభుత్వ ఆసుపత్రి వైద్యులు డాక్టర్ లక్ష్మీకాంత్ రెడ్డి, డాక్టర్ ప్రణీత్‌ను పిలిపించి పోలీసులు పోస్టుమార్టం చేయించారు. అనంతరం మృతదేహాన్ని తీసుకు వెళ్లడానికి కుటుంబ సభ్యులు నిరాకరించారు. అంబులెన్స్‌లో ఉన్న మృతదేహాన్ని చూసి తల్లిదండ్రులు, సోదరుడు వెనుదిరిగారు.

Shabad Murder Case | మున్సిపల్ సిబ్బంది సహకారంతో..

చేవెళ్ల మున్సిపాలిటీ సిబ్బంది సహకారంతో పోలీసులు అంత్యక్రియలు నిర్వహించారు. రాజ్​కుమార్​ ఓ బాలికను ఆమె తల్లి, నాయనమ్మను హత్య చేయడంతో ఆ ఇంట్లో మరో బాలిక ఒంటరి అయిపోయింది. ఆమె దివ్యాంగురాలు. దీంతో ప్రభుత్వం బాధితురాలకి రూ.10 లక్షల పరిహారం, ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేసింది.

ఇది కూడా చదవండి..: Rajkumar Selfie Video | ఆరు హత్యలకు ముందు రాజ్​కుమార్​ సెల్ఫీ వీడియో.. నాలుగు పేజీల సూసైడ్ నోట్ స్వాధీనం

తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *