అక్షరటుడే, కామారెడ్డి: RTC Bus Accident | ఆర్టీసీ బస్సు ముందు వెళ్తున్న కంటైనర్‌ను ఢీకొంది. ఈ ఘటన భిక్కనూర్ మండలం జంగంపల్లి 44వ జాతీయ రహదారిపై చోటుచేసుకుంది. ప్రమాదంలో డ్రైవర్‌కు గాయాలయ్యాయి.
RTC Bus Accidentv | అతివేగమే కారణమా..?
కామారెడ్డి (Kamareddy) నుంచి జేబీఎస్ వెళ్తున్న ఎక్స్‌ప్రెస్ బస్సు ముందు వెళ్తున్న కంటైనర్‌ను బలంగా ఢీకొంది. ఈ ఘటనలో బస్సు ముందుబాగం ధ్వంసం కాగా బస్సు డ్రైవర్ బాలయ్యకు తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే అతడిని కామారెడ్డి జీజీహెచ్‌కు తరలించారు. బస్సులో ఉన్న ప్రయాణికులకు ఎలాంటి ప్రమాదం జరగకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు ట్రాఫిక్ క్లియర్ చేసి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. అతివేగమే ప్రమాదానికి కారణమని భావిస్తున్నారు.
ఇది కూడా చదవండి..: Manala Mohan Reddy | బీఆర్ఎస్ చేసిన పాపాలే రాష్ట్రానికి శాపాలు : డీసీసీ మాజీ అధ్యక్షుడు మానాల