Kamareddy Police | గుండెపోటుతో వృద్ధుడి మృతి.. ఆస్తి కోసం హత్య చేశారని ఆరోపణలు..

గుండెపోటుతో వృద్ధుడు మృతి చెందాడు. అయితే కన్నతండ్రిని కుమార్తె కుటుంబమే హత్య చేసిందని ఆరోపిస్తూ కోడలు పోలీసులకు ఫిర్యాదు చేసింది.

shashi kiran Mottala

అక్షరటుడే, కామారెడ్డి: Kamareddy Police | గుండెపోటుతో వృద్ధుడు మృతి చెందాడు. అయితే కన్నతండ్రిని కుమార్తె కుటుంబమే హత్య చేసిందని ఆరోపిస్తూ కోడలు పోలీసులకు (Kamareddy Police) ఫిర్యాదు చేసింది. ఈ ఘటన కామారెడ్డి (Kamareddy) మండలం చిన్న మల్లారెడ్డి గ్రామంలో కలకలం రేపింది.

Kamareddy Police | చిన్న మల్లారెడ్డి గ్రామంలో..

ఫిర్యాదుదారు లావణ్య తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన గద్దె నారాయణను నాలుగు నెలల క్రితం కుమార్తె విమల వృద్ధాశ్రమంలో చేర్పించింది. బుధవారం మధ్యాహ్నం నారాయణను విమల ఇంటికి తీసుకురాగా.. అదే రాత్రి ఆయనకు గుండెపోటు వచ్చిందని చెబుతూ ముందుగా ఓ ప్రైవేట్ ఆస్పత్రికి, తర్వాత ప్రభుత్వ ఆస్పత్రికి తరలించింది. అక్కడ వైద్యులు పరీక్షించి నారాయణ మృతి చెందినట్లు ధ్రువీకరించారు.

అయితే విషయం ఎవరికీ తెలియకుండా మృతదేహాన్ని ఇంటికి తీసుకెళ్లేందుకు విమల కుటుంబ సభ్యులు ప్రయత్నించడంతో కోడలు గద్దె లావణ్య అడ్డుకుంది. ఆస్తి కోసమే మామ నారాయణను కుమార్తె విమల, ఆమె కుటుంబ సభ్యులు హత్య చేశారని ఆరోపిస్తూ దేవునిపల్లి పోలీస్ స్టేషన్​లో (Devunipalli Police Station) లావణ్య ఫిర్యాదు చేసింది. ఫిర్యాదు మేరకు పోలీసులు మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆస్పత్రి మార్చురీకి తరలించారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

Kamareddy

ఇది కూడా చదవండి: July 16 Gold Prices | బంగారం ధరల్లో మళ్లీ పెరుగుదల.. 24 క్యారెట్ల గ్రాము గోల్డ్​ ఎంతంటే!

తెలుగు జర్నలిజంలో 20 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2005లో ‘వార్త’ దినపత్రికలో స్పోర్ట్స్​ రిపోర్టర్​గా పనిచేశాను. అనంతరం రెండేళ్ల పాటు సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. 2010లో ‘సాక్షి’ జర్నలిజం స్కూల్​లో శిక్షణ పొందాను. అనంతరం ‘సాక్షి’ దినపత్రికలో సబ్​ఎడిటర్​గా చేరాను. సీనియర్​ సబ్​ ఎడిటర్​గా ప్రమోషన్​ పొందాను. 2024 నవంబర్​ నుంచి ‘అక్షరటుడే’లో చీఫ్​ సబ్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, స్థానికం, జనరల్​, క్రైం, వైరల్​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *