అక్షరటుడే, కామారెడ్డి : Kamareddy SI Transfers | జిల్లా పోలీసు శాఖలో (Kamareddy Police) బదిలీలు చోటుచేసుకున్నాయి. పలు కీలక పోలీసు స్టేషన్లలో ఇన్ఛార్జీలుగా ఉన్న ఎస్సైలను సర్దుబాటు చేస్తూ ఎస్పీ రాజేష్ చంద్ర (SP Rajesh Chandra) ఉత్తర్వులు జారీ చేశారు.
Kamareddy SI Transfers | శాంతిభద్రతల పర్యవేక్షణ మరింత పటిష్టంగా..
శాంతిభద్రతల పర్యవేక్షణ మరింత పటిష్టంగా ఉండేలా ఈ బదిలీలు చేపట్టినట్లు తెలుస్తోంది. మాచారెడ్డి ఎస్సైగా బాధ్యతలు నిర్వర్తిస్తున్న అనిల్‌ను భిక్కనూరు స్టేషన్‌కు బదిలీ చేశారు. భిక్కనూరులో విధులు నిర్వహిస్తున్న ఆంజనేయులును రాజాంపేటకు పంపగా, రాజాంపేటలో ఉన్న మహేష్‌ను జిల్లా కేంద్రంలోని సీసీఎస్‌కు కేటాయించారు. ఇక బీబీపేట స్టేషన్ బాధ్యతలు చూస్తున్న విజయ్ ను మాచారెడ్డికి, బాన్సువాడ టౌన్ ఎస్సై నవీన్ చంద్రను బీబీపేటకు బదిలీ చేస్తూ ఎస్పీ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ బదిలీలతో పలు మండలాల్లో కొత్త ఎస్సైలు బాధ్యతలు చేపట్టనున్నారు. కొత్తగా వచ్చిన అధికారులు తమ పరిధిలో నేరాల నియంత్రణ, శాంతిభద్రతల పరిరక్షణకు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని ఎస్పీ ఆదేశించినట్లు సమాచారం. బదిలీ అయిన అధికారులు వెంటనే కొత్త స్టేషన్లలో బాధ్యతలు స్వీకరించనున్నట్టు తెలుస్తోంది.
ఇది కూడా చదవండి: నాచారం చెరువు అభివృద్ధికి శ్రీకారం..