Adilabad ACB Trap | ఏసీబీకి చిక్కిన ఇరిగేషన్​ ఈఈ, ఏఈ

ఆదిలాబాద్ జిల్లా నీటిపారుదల శాఖ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ రాథోడ్​ విఠల్​, అసిస్టెంట్​ ఇంజినీర్​ రూపవతి రమేశ్​ లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు దొరికారు.

Srinivas Kolluri

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Adilabad ACB Trap | ఆదిలాబాద్ (Adilabad) జిల్లా నీటిపారుదల శాఖ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ (EE) రాథోడ్​ విఠల్​, అసిస్టెంట్​ ఇంజినీర్ (AE)​ రూపవతి రమేశ్​ లంచం తీసుకుంటూ ఏసీబీ (ACB) అధికారులకు రెడ్​హ్యాండెడ్​గా దొరికారు.

సోనాల్ గ్రామానికి చెందిన సోదరులు గ్రామంలో పౌల్ట్రీ ఫామ్​ నిర్మించుకోవాలి అనుకున్నారు. అయితే తమ వ్యవసాయ భూమి పక్క నుంచి చిన్న కాలువ వెళ్తుంది. దీంతో నీటి పారుదల శాఖ అధికారుల నుంచి ఎన్​వోసీ కావాల్సి వచ్చింది. దీని కోసం దరఖాస్తు చేసుకోగా.. ఈఈ రాథోడ్ విఠల్​ లంచం డిమాండ్​ చేశాడు. రూ.60 వేలు ఇస్తేనే పని చేస్తానన్నారు. దీంతో బాధితులు ఏసీబీ అధికారులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు గురువారం బాధితుల నుంచి ఏఈ రమేశ్​ ద్వారా ఈఈ లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు వల పన్ని పట్టుకున్నారు. అనంతరం కార్యాలయంలో సోదాలు చేశారు.

Adilabad ACB Trap | లంచం ఇవ్వొద్దు

ప్రభుత్వ అధికారులకు లంచం ఇవ్వొద్దని ఏసీబీ అధికారులు సూచిస్తున్నారు. ఎవరైనా లంచం అడిగితే తమకు ఫిర్యాదు చేయాలని కోరారు. ఏసీబీ టోల్ ఫ్రీ నంబర్ 1064, వాట్సాప్ నంబర్​ 9440446106 లో ఫిర్యాదు చేయవచ్చని వివరించారు. వెబ్​సైట్ (ACB Website)​ ద్వారా కంప్లైట్​ చేయొచ్చని పేర్కొన్నారు. ఫిర్యాదుదారుల వివరాలను గోప్యంగా ఉంచుతామన్నారు.

దీనిని కూడా చదవండి : Telangana Rain Alert | తెలంగాణలో రానున్న మూడు రోజులు వర్షాలు..

తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.
1 Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *