అక్షరటుడే, వెబ్‌డెస్క్: Shankarpally Tragedy | రంగారెడ్డి జిల్లా (Ranga Reddy District) శంకర్‌పల్లిలో విషాదం చోటు చేసుకుంది. ఇద్దరు పిల్లలను బావిలో తోసి, తానూ దూకి ఓ తల్లి ఆత్మహత్య చేసుకుంది.
కొడంగల్ ప్రాంతానికి చెందిన వసంత, సుధాకర్ దంపతులు ఉపాధి కోసం నగరానికి వలస వచ్చారు. శంకర్పల్లి సమీపంలో కొత్తపల్లిలో ఉంటూ జీవనం సాగిస్తున్నారు. ఈ దంపతులకు కూతురు (15), కుమారుడు (10) ఉన్నారు. గురువారం రాత్రి దంపతుల మధ్య గొడవ జరిగింది. దీంతో వసంత ఆత్మహత్య చేసుకోవాలని నిర్ణయించుకుంది. తన ఇద్దరు పిల్లలను తీసుకొని ఇంటి నుంచి బయటకు వచ్చింది.
Shankarpally Tragedy | కాపాడిన చెట్టుకొమ్మ
వసంత తన పిల్లలను బావిలోకి తోసి వేసింది. అనంతరం ఆమె సైతం దూకింది. ఈ ఘటనలో తల్లీ కూతుళ్లు చనిపోగా.. ఆ బాలుడిని చెట్టుకొమ్మ కాపాడింది. బావిలో పడుతున్న బాలుడు చెట్టుకొమ్మకు చిక్కుకొని ప్రాణాలతో బయటపడ్డాడు. సమాచారం అందుకున్న శంకర్పల్లి పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని పరిశీలించారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.
ఇది కూడా చదవండి..: Shabad Murder Case | రాజ్‌కుమార్ మృతదేహం తీసుకెళ్లని కుటుంబ సభ్యులు.. అనాథల అంత్యక్రియలు