BRS Yuva Sangrama Sabha | బీఆర్​ఎస్​కు షాక్​.. యువ సంగ్రామ సదస్సుకు అనుమతి నిరాకరణ

బీఆర్​ఎస్​కు పోలీసులు షాక్​ ఇచ్చారు. ఆ పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించ తలపెట్టిన యువ సంగ్రామ సదస్సుకు అనుమతి ఇవ్వలేదు.

shashi kiran Mottala

అక్షరటుడే, వెబ్​డెస్క్: BRS Yuva Sangrama Sabha | బీఆర్​ఎస్​కు పోలీసులు షాక్​ ఇచ్చారు. ఆ పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించ తలపెట్టిన యువ సంగ్రామ సదస్సుకు అనుమతి ఇవ్వలేదు.

కాంగ్రెస్​ ప్రభుత్వం (Congress government)పై ఒత్తిడి పెంచాలని బీఆర్​ఎస్​ యోచిస్తోంది. ఈ మేరకు ఆరు గ్యారంటీలు, డిక్లరేషన్​లపై పెద్ద ఎత్తున ప్రచారం చేస్తోంది. ఎన్నికల సమయంలో డిక్లరేషన్​ల పేరిట హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్​ తర్వాత వాటిని అమలు చేయడం లేదని గులాబీ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వీటిని ప్రజల్లోకి తీసుకు వెళ్లడానికి పెద్ద ఎత్తున సభలు నిర్వహించాలని ప్రణాళిక రచించారు. ఇప్పటికే వరంగల్​ రైతు సభ పెట్టిన నాయకులు.. తాజాగా హైదరాబాద్​లోని సరూర్​ నగర్​లో యువ సంగ్రామ సదస్సు నిర్వహణకు ఏర్పాట్లు చేస్తున్నారు. అయితే ఈ సభకు పోలీసులు అనుమతి ఇవ్వలేదు.

BRS Yuva Sangrama Sabha | కోర్టుకు వెళ్తాం

BRS Yuva Sangrama Sabha

నిరుద్యోగులు, యువతకు ఇచ్చిన హామీలు అమలు చేయాలని బీఆర్​ఎస్​ యువ సంగ్రామ సదస్సు నిర్వహిస్తోంది. ఆ పార్టీ ముఖ్య నాయకులు దీనికి హాజరు కానున్నారు. పెద్ద ఎత్తున యువత, నిరుద్యోగులను తరలించడానికి బీఆర్​ఎస్​ నాయకులు సన్నాహాలు చేస్తున్నారు. రేపటి సభ కోసం అన్ని ఏర్పాట్లు పూర్తి అయ్యాయి. అయితే దీనికి పోలీసులు మాత్రం అనుమతి ఇవ్వలేదు. దీంతో సదస్సు నిర్వహణపై ఉత్కంఠ నెలకొంది. సభకు పోలీసులు అనుమతి ఇవ్వలేదని బీఆర్‌ఎస్‌ నేతలు సుధీర్‌ రెడ్డి, శంభీపూర్‌ రాజు తెలిపారు. సభ అనుమతి కోసం హైకోర్టును ఆశ్రయిస్తామని వారు పేర్కొన్నారు. కావాలనే అనుమతి ఇవ్వలేదని కాంగ్రెస్‌ సర్కార్‌పై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎట్టి పరిస్థితుల్లో సభ నిర్వహించి తీరుతామని నాయకులు పేర్కొన్నారు.

ఇది కూడా చదవండి..: Telangana Congress Meetings | తెలంగాణ కాంగ్రెస్‌లో కీలక మార్పులు.. మంత్రులతో మీనాక్షి నటరాజన్ భేటీ

తెలుగు జర్నలిజంలో 20 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2005లో ‘వార్త’ దినపత్రికలో స్పోర్ట్స్​ రిపోర్టర్​గా పనిచేశాను. అనంతరం రెండేళ్ల పాటు సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. 2010లో ‘సాక్షి’ జర్నలిజం స్కూల్​లో శిక్షణ పొందాను. అనంతరం ‘సాక్షి’ దినపత్రికలో సబ్​ఎడిటర్​గా చేరాను. సీనియర్​ సబ్​ ఎడిటర్​గా ప్రమోషన్​ పొందాను. 2024 నవంబర్​ నుంచి ‘అక్షరటుడే’లో చీఫ్​ సబ్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, స్థానికం, జనరల్​, క్రైం, వైరల్​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *