Constable Harassment | కానిస్టేబుల్​ వేధింపులతో యువకుడి సూసైడ్​.. వెలుగులోకి సెల్ఫీ వీడియో..

Srinivas Kolluri

అక్షరటుడే, వెబ్​డెస్క్:Constable Harassment | నిజామాబాద్​ (Nizamabad) నగరంలోని హమల్​వాడి డోల అనిల్​ అనే యువకుడు రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే. ఈ ఘటన తీవ్ర చర్చకు దారి తీసింది. యువకుడు చనిపోయే ముందు తీసుకున్న సెల్ఫీ వీడియో వెలుగులోకి వచ్చింది.

ఇందులో సదరు యువకుడు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశాడు. తనను ఓ యువతితో పాటు ఓ మహిళా కానిస్టేబుల్​ (Woman Constable) మానసిక వేధింపులకు గురి చేశారని పేర్కొన్నాడు. ‘నాపై, నా కుటుంబ సభ్యులపై కేసులు పెడతామని కానిస్టేబుల్​ బెదిరించారు. నన్ను ఇష్టం వచ్చినట్లు దూషించారు. నన్ను జైలులో పెడతామన్నారు. నువ్వు చావు లేదంటే మేమే చంపేస్తాం. నా మేన మరదలు ఎంగేజ్​మెంట్​ అయింది. అయినా కూడా నన్ను వదలడం లేదు’ అంటూ వీడియో వాపోయాడు.

Constable Harassment

Constable Harassment | పోలీసులకు కుటుంబ సభ్యుల ఫిర్యాదు

సెల్ఫీ వీడియో (Selfie Video) వెలుగులోకి రావడంతో యువకుడి కుటుంబ సభ్యులు వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశారు. యువకుడి ఆత్మహత్యకు కారణమైన వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్​ చేశారు. ఈ సందర్భంగా యువకుడి తండ్రి మాట్లాడుతూ తన కుమారుడికి ఎలాంటి ఇతర బాధలు లేవని తెలిపారు. ఓ యువతితో పాటు కానిస్టేబుల్​ తీవ్రంగా వేధించారని తెలిపాడు. తన కుమారుడికి మేన మరదలితో ఎంగేజ్​మెంట్​ చేశామని వివరించాడు. కానీ యువతి తన కుమారుడి ఇబ్బంది పెట్టిందని.. అలాగే కానిస్టేబుల్​ సైతం బెదిరించారని ఆవేదన వ్యక్తం చేశారు.

ఇది కూడా చదవండి..: Yellareddy Municipality | మాట తప్పని కౌన్సిలర్​.. ఇచ్చిన హామీలను నెరవేరుస్తూ ముందుకెళ్తున్న సిద్ధి శ్రీధర్​ గుప్తా

తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.
1 Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *