అక్షరటుడే, వెబ్‌డెస్క్:Kavitha New Party | తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, మాజీ సీఎం కేసీఆర్ (KCR) కూతురు కొత్త పార్టీ పేరు ప్రకటించారు. శనివారం ఉదయం మేడ్చల్ సమీపంలోని మునీరాబాద్‌లోని ఓ ఫంక్షన్ హాల్లో పార్టీ ఆవిర్భావ దినోత్సవం ఘనంగా నిర్వహించారు. తన పార్టీ పేరు టీఆర్ఎస్ అని కవిత ప్రకటించారు. తెలంగాణ రాష్ట్ర సేన అని తెలిపారు. ఈ కార్యక్రమానికి పెద్ద ఎత్తున జాగృతి నాయకులు, కార్యకర్తలు, కవిత అభిమానులు తరలి వచ్చారు. పార్టీ పేరు ప్రకటన అనంతరం ప్రాంగణం జై తెలంగాణ నినాదాలతో మారుమోగింది. ఈ కార్యక్రమానికి పెద్ద ఎత్తున జాగృతి నాయకులు, కార్యకర్తలు, కవిత (Kalvakuntla Kavitha) అభిమానులు తరలి వచ్చారు.
Kavitha New Party | సీఎం అని నినాదాలు
కవిత తన ఇంట్లో సర్వ మత ప్రార్థనలు చేసిన అనంతరం గన్‌పార్క్‌కు చేరుకొని అమరవీరులకు నివాళులు అర్పించారు. అనంతరం భారీ కాన్వాయ్‌తో సభ వేదికకు చేరుకున్నారు. అన్ని జిల్లాల నుంచి అభిమానులు భారీ సంఖ్యలో సభకు చేరుకున్నారు. వేలాది అభిమానుల మధ్య కవిత తన పార్టీ పేరును ప్రకటించారు. దీంతో అభిమానులు సీఎం సీఎం అంటూ నినాదాలు చేశారు.

ఇది కూడా చదవండి..: Kavitha New Party | తెలంగాణ రాజకీయాల్లో మరో కొత్త పార్టీ.. మరికాసేపట్లో పేరును ప్రకటించనున్న కవిత..

