Traffic Police Chase | ట్రాఫిక్​ పోలీసులను చూసి ఇద్దరు వ్యక్తులు పరార్​.. వెంబడించి పట్టుకున్న కానిస్టేబుల్​..​

ట్రాఫిక్​ పోలీసులను చూసి బైక్​పై వచ్చిన ఇద్దరు పరారయ్యారు. ఈ క్రమంలో అక్కడే ఉన్న ట్రాఫిక్​ పోలీస్​ వెంబడించి ఇద్దరిలో ఒకరిని పట్టుకున్నారు.

shashi kiran Mottala

అక్షరటుడే, నిజామాబాద్​ సిటీ: Traffic Police Chase | ట్రాఫిక్​ పోలీసులను (Traffic Police) చూసి బైక్​పై వచ్చిన ఇద్దరు పరారయ్యారు. ఈ క్రమంలో అక్కడే ఉన్న ట్రాఫిక్​ పోలీస్​ వెంబడించి ఇద్దరిలో ఒకరిని పట్టుకున్నారు. ఈ ఘటన నగరంలోని(Nizamabad) దేవిటాకీస్​ రోడ్​ చౌరస్తా ట్రాఫిక్​ సిగ్నల్​ వద్ద శనివారం చోటు చేసుకుంది.

Traffic Police Chase |తనిఖీల్లో భాగంగా..

నగరంలోని దేవి టాకీస్​ చౌరస్తా వద్ద ట్రాఫిక్​ సీఐ ప్రసాద్​ ఆధ్వర్యంలో పోలీసులు తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఇదే సమయంలో పల్సర్​ బైక్​పై వచ్చిన ఇద్దరు వ్యక్తులు పోలీసులను చూసి వాహనాన్ని అక్కడే వదిలేసి పారిపోయేందుకు ప్రయత్నించారు. దీంతో అప్రమత్తమైన కానిస్టేబుల్​ నరేష్​ వారిని వెంబడించి ఒకరిని పట్టుకున్నాడు. అతడిని తనిఖీ చేయగా బంగారు గొలుసు లభ్యమైంది. బైక్​ వివరాలు తనిఖీ చేయగా హైదరాబాద్​ పాసింగ్​ అని గుర్తించారు. అనంతరం అనుమానితుడిని ట్రాఫిక్​ పోలీసులు వన్​టౌన్​ పోలీస్​స్టేషన్​లో అప్పగించారు. తనిఖీల్లో ఆర్​ఐ వినోద్, సిబ్బంది పాల్గొన్నారు.

ఇది కూడా చదవండి: National Film Awards | జాతీయ చలనచిత్ర అవార్డుల ప్రకటన.. ఉత్తమ తెలుగు చిత్రంగా కమిటీ కుర్రోళ్లు

తెలుగు జర్నలిజంలో 20 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2005లో ‘వార్త’ దినపత్రికలో స్పోర్ట్స్​ రిపోర్టర్​గా పనిచేశాను. అనంతరం రెండేళ్ల పాటు సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. 2010లో ‘సాక్షి’ జర్నలిజం స్కూల్​లో శిక్షణ పొందాను. అనంతరం ‘సాక్షి’ దినపత్రికలో సబ్​ఎడిటర్​గా చేరాను. సీనియర్​ సబ్​ ఎడిటర్​గా ప్రమోషన్​ పొందాను. 2024 నవంబర్​ నుంచి ‘అక్షరటుడే’లో చీఫ్​ సబ్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, స్థానికం, జనరల్​, క్రైం, వైరల్​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *