అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Revanth Reddy Warning | కాంగ్రెస్ నేతలకు సీఎం రేవంత్‌రెడ్డి (CM Revanth Reddy) వార్నింగ్ ఇచ్చారు. రాష్ట్రంలో కొనసాగుతున్న ఎస్‌ఐఆర్ ప్రక్రియపై పీసీసీ చీఫ్ మహేశ్‌కుమార్ గౌడ్ (PCC Chief)తో కలిసి ఆయన కాంగ్రెస్ ముఖ్య నాయకులతో జూమ్ మీటింగ్ నిర్వహించారు.
ఎస్‌ఐఆర్ (SIR)పై ప్రతి ఒక్కరూ సీరియస్‌గా పని చేయాలని సీఎం రేవంత్‌రెడ్డి ఆదేశించారు. ఆగస్టు 3 వరకు నేతలెవరూ గాంధీభవన్‌కు రావొద్దని స్పష్టం చేశారు. గాంధీభవన్ చుట్టూ తిరిగితే పదవులు రావన్నారు. హైదరాబాద్‌లో ఉంటే కుదరదని, క్షేత్రస్థాయిలో పని చేయాలని తెలిపారు. పనిచేయని ఇన్‌చార్జ్‌లపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.
Revanth Reddy Warning | సమన్వయం చేయాలి
బీఎల్‌వో (BLO) రిపోర్టులపైనే ఆధారపడొద్దని సీఎం పేర్కొన్నారు. బీఎల్‌ఏ రిపోర్టులకు ప్రాధాన్యం ఇవ్వాలని సూచించారు. నాయకులు అందరూ పది రోజులు ఎన్నికల ప్రచారం తరహాలో పనిచేయాలన్నారు. జూలై 30న పనితీరుపై పూర్తిస్థాయి సమీక్ష నిర్వహిస్తామని తెలిపారు. ఎస్‌ఐఆర్‌పై నిర్లక్ష్యంచేస్తే చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. ఇన్ఛార్జీ మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎస్‌ఐఆర్ ఇన్ఛార్జీలను మహేష్‌గౌడ్, భట్టి విక్రమార్క సమన్వయం చేయాలన్నారు. రాష్ట్రంలో 100 మంది ఉత్తమ బీఎల్ఏలకు రాహుల్ గాంధీతో భేటీకి అవకాశం కల్పిస్తామని సీఎం హామీ ఇచ్చారు.
Revanth Reddy Warning | సీరియస్‌గా తీసుకోవాలి
పీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్ గౌడ్ మాట్లాడుతూ.. చాలా మంది ఎమ్మెల్యేలు SIRపై సీరియస్‌గా లేరన్నారు. ఈ ప్రక్రియను కాంగ్రెస్ నేతలు ఇంకా సీరియస్‌గా తీసుకోవాలని స్పష్టం చేశారు. ఎమ్మెల్యేలు క్షేత్రస్థాయిలో యాక్టివ్‌గా ఉండాలని, ఇన్‌ఛార్జి మంత్రులు కచ్చితంగా ఫాలోఅప్ చేయాన్నారు. బీఎల్ఏలకు స్థానిక నాయకులు సహకరించాలని ఆదేశించారు.
దీనిని కూడా చదవండి : PV Sindhu Japan Open | పీవీ సింధు సంచలనం.. జపాన్ ఓపెన్ టైటిల్ కైవసం