Uday Krishna Reddy | ట్రైనీ ఐపీఎస్ ఉదయ్ కృష్ణారెడ్డి ఆత్మహత్యాయత్నం

ట్రైనీ ఐపీఎస్ ఉదయ్ కృష్ణారెడ్డి ఆత్మహత్యాయత్నం చేశారు. ప్రస్తుతం ఆయన పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం.

Srinivas Kolluri

అక్షరటుడే, వెబ్​డెస్క్: Uday Krishna Reddy | ట్రైనీ ఐపీఎస్ ఉదయ్ కృష్ణారెడ్డి ఆత్మహత్యాయత్నం చేశారు. ఆయనపై లైంగిక వేధింపుల కేసు నమోదైన విషయం తెలిసిందే. దీంతోనే ఆత్మహత్యాయత్నం చేసినట్లు తెలుస్తోంది.

హైదరాబాద్​ (Hyderabad)లోని జాతీయ పోలీస్​ అకాడమీలో శిక్షణ పొందుతున్న కృష్ణారెడ్డిపై మహిళా ట్రైనీ ఐపీఎస్​ అత్తాపూర్​ పోలీసులకు ఫిర్యాదు చేశారు. మూడు వారాలుగా లైంగికంగా వేధించాడని, శారీరకంగా దాడి చేశాడని, బ్లాక్‌మెయిల్ చేశాడని ఆరోపించడంతో పోలీసులు కేసు నమోదు చేశారు. తన ప్రైవేట్ వీడియోను రహస్యంగా రికార్డ్ చేసి తన భర్తకు పంపించాడని ఆ మహిళా అధికారి ఫిర్యాదులో పేర్కొన్నారు. తనపై వచ్చిన ఆరోపణలు అవాస్తమని ఉదయ్​ కృష్ణారెడ్డి పేర్కొన్నారు. ఈ క్రమంలో ఆయన ఆత్మహత్యాయత్నం చేసుకోవడం గమనార్హం.

Uday Krishna Reddy | విషమంగా పరిస్థితి

ఎర్రగడ్డ, మోతీనగర్ ప్రాంతంలో ఉదయ్​ కృష్ణారెడ్డి ఆత్మహత్యకు యత్నించాడు. గమనించిన స్థానికులు వెంటనే ఆయనను ఎర్రగడ్డలోని ఓ ప్రైవేట్​ ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం విషమంగా ఉన్నట్లు సమాచారం. ఆయన ఆరోగ్య పరిస్థితిపై అధికారిక ధృవీకరణ ఇంకా రావాల్సి ఉంది. కాగా ఆయనపై కేసు నమోదు అయిన మరుసటి రోజే ఈ ఘటన చోటుచేసుకోవడం గమనార్హం.

Uday Krishna Reddy | స్ఫూర్తిగా నిలిచి..

ఉదయ్​ కృష్ణారెడ్డి కానిస్టేబుల్​ నుంచి ఐపీఎస్​కు ఎంపికయ్యాడు. ప్రకాశం జిల్లాకు చెందిన ఆయన 2013లో కానిస్టేబుల్​గా జాయిన్​ అయ్యాడు. అయితే ఓ సీఐ అవమానించడంతో తన ఉద్యోగానికి రాజీనామా చేశాడు. అనంతరం కష్టపడి చదివి ఐదో ప్రయత్నంలో ఐపీఎస్​ సాధించాడు. ఆ సమయంలో ఎంతో మంది యువతకు ఆదర్శంగా నిలిచిన ఉదయ్​ కృష్ణారెడ్డి తాజా వివాదంతో ఆత్మహత్యాయత్నం చేసుకునే వరకు వెళ్లారు. తనపై వచ్చిన ఆరోపణలన్నీ నిరాధారం అంటూ ఉదయ్​ ఇన్‌స్టా స్టోరీస్‌లో పోస్ట్​ చేశాడు.

ఇది కూడా చదవండి..: H-FAST Raids | హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల్లో హెచ్​-ఫాస్ట్​ దాడులు

తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *