అక్షరటుడే వెబ్‌డెస్క్: Gujarat Child Murder | గుజరాత్‌లోని ఆనంద్ జిల్లాలో నాలుగేళ్ల చిన్నారిని కిడ్నాప్ చేసి, అత్యంత కిరాతకంగా హతమార్చిన ఘటన దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఈ కేసులో నిందితుడైన సురేశ్ పార్మర్, పోలీసులతో జరిపిన ఎదురుకాల్పుల్లో మరణించాడు.
Gujarat Child Murder | ఘటన వివరాలు..
వసాద్ రైల్వే స్టేషన్ వద్ద నివసించే ఓ వలస కుటుంబానికి చెందిన నాలుగేళ్ల చిన్నారిని, సురేశ్ పార్మర్ అనే వ్యక్తి రాత్రి సమయంలో నిద్రిస్తుండగా కిడ్నాప్ చేశాడు. చిన్నారిపై అఘాయిత్యానికి పాల్పడిన నిందితుడు, అనంతరం రైలు పట్టాలపై పడేసి దారుణంగా హత్య చేశాడు. ఈ దృశ్యాలు సమీపంలోని సీసీటీవీ కెమెరాల్లో రికార్డ్ అయ్యాయి. పోలీసులు వెంటనే స్పందించి నిందితుడిని అరెస్ట్ చేశారు.
Gujarat Child Murder | ఎన్‌కౌంటర్ జరిగింది ఇలా..
నిందితుడిని విచారణ నిమిత్తం క్రైమ్ బ్రాంచ్ పోలీసులకు అప్పగించగా, వాహనంలో తీసుకెళ్తున్న సమయంలో అతను డ్రామా మొదలుపెట్టాడు. తనకు వాంతులు వస్తున్నాయని పోలీసులను నమ్మించి, వాహనం దిగి తన వద్ద ఉన్న కత్తితో అధికారులపై దాడి చేశాడు. ఈ దాడిలో రాజ్‌వీర్, మహిపాల్ అనే ఇద్దరు పోలీసులు తీవ్రంగా గాయపడ్డారు. పీఎస్ఐ రానా పదేపదే హెచ్చరించినా నిందితుడు దాడి కొనసాగించడంతో, ఆత్మరక్షణ కోసం పోలీసులు జరిపిన కాల్పుల్లో సురేశ్ పార్మర్ తీవ్రంగా గాయపడ్డాడు. చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించగా, అప్పటికే అతను మరణించినట్లు వైద్యులు ధృవీకరించారు. ప్రస్తుతం గాయపడిన పోలీసులు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. చిన్నారి హత్యకు సంబంధించిన పోస్ట్‌మార్టం నివేదిక కోసం పోలీసులు వేచి చూస్తున్నారు.
Accused in minor’s Rape and Murder killed in Police Encounter.
An accused individual arrested for the brutal rape and murder of a 4-year-old girl was shot dead in a police encounter near Anand, Gujarat, after he allegedly attacked law enforcement personnel.
According to… pic.twitter.com/cV1F4q6KyV
— GarudEyeIntel | OSINT 🇮🇳 (@GarudEyeIntel) July 20, 2026
ఇది కూడా చదవండి: Traffic Restrictions | నగరవాసులకు అలెర్ట్.. హైదరాబాద్లో ట్రాఫిక్ ఆంక్షలు