Police Health Screening | పోలీసులు విధి నిర్వహణతో పాటు ఆరోగ్యంపై శ్రద్ధ పెట్టాలి: సీపీ సాయిచైతన్య

పోలీసులు విధినిర్వహణతో పాటు ఆరోగ్యంపై కూడా శ్రద్ధ పెట్టాలని సీసీ సాయిచైతన్య సూచించారు.

shashi kiran Mottala

అక్షరటుడే, నిజామాబాద్​ క్రైం: Police Health Screening | పోలీసులు విధినిర్వహణతో పాటు ఆరోగ్యంపై కూడా శ్రద్ధ పెట్టాలని సీపీ సాయిచైతన్య (CP Sai Chaitanya) సూచించారు. నగరంలోని బ్రిడ్జిగ్యాప్ హాస్పిటల్, ఇందూర్ క్యాన్సర్ హాస్పిటల్, మేఘన డెంటల్ హాస్పిటల్, లెజిట్ డయాగ్నొస్టిక్స్ వారి సౌజన్యంతో పోలీస్ శాఖ సిబ్బందికి ఉచిత క్యాన్సర్ స్క్రీనింగ్ డ్రైవ్​ను ఆయన ప్రారంభించారు.

Police Health Screening |బాధ్యతాయుతమైన సేవ..

పోలీస్ కమిషనర్ మాట్లాడుతూ పోలీస్ ఉద్యోగం అనేది ప్రజల ప్రాణాలు, ఆస్తుల రక్షణ కోసం నిరంతరం అప్రమత్తంగా ఉండే అత్యంత బాధ్యతాయుతమైన సేవ అన్నారు. విధి నిర్వహణలో పోలీసులు అనేక రకాల శారీరక, మానసిక ఒత్తిళ్లను ఎదుర్కొంటుంటారన్నారు. అసమయ భోజనం, నిద్రలేమి, నిరంతర విధులు, ఒత్తిడితో కూడిన జీవనశైలి కారణంగా అనేక ఆరోగ్య సమస్యలు తలెత్తే అవకాశం ఉంటుంది. అందువల్ల ప్రతి పోలీసు అధికారి, సిబ్బంది తమ ఆరోగ్యాన్ని కూడా విధి నిర్వహణలో భాగంగానే భావించి క్రమం తప్పకుండా ఆరోగ్య పరీక్షలు చేయించుకోవాలని సూచించారు.

Police Health Screening | క్యాన్సర్​ను ముందుగా గుర్తిస్తే..

క్యాన్సర్ అనేది ముందస్తుగా గుర్తిస్తే సమర్థవంతంగా చికిత్స చేయగలిగే వ్యాధి అని సీపీ అన్నారు. అవగాహన లోపం, నిర్లక్ష్యం వల్ల చాలామంది ఆలస్యంగా వైద్యులను సంప్రదిస్తుంటారన్నారు. ప్రారంభ దశలోనే క్యాన్సర్‌ను గుర్తించడం ద్వారా చికిత్స విజయవంతం కావడమే కాకుండా ప్రాణాలను కూడా కాపాడుకోవచ్చని చెప్పారు. అందుకే క్యాన్సర్ స్క్రీనింగ్ పరీక్షలు ప్రతిఒక్కరికీ ఎంతో అవసరమన్నారు. ఈ కార్యక్రమంలో ఏసీపీ ప్రకాష్ యాదవ్, పోలీస్ యూనిట్ మెడికల్ ఆఫీసర్ సరళ, ఇందుర్ క్యాన్సర్ హాస్పిటల్ మెడికల్ డైరెక్టర్ అమర్ దీపిక, అనాలజిస్ట్ అరవింద్, కార్తీక్, ఆర్ఎంవో రవీంద్రనాథ్ సూరి, మేఘన డెంటల్ కాలేజ్ అసోసియేట్ ప్రొఫెసర్ ఆదిత్య తేజ, రిజర్వ్ ఇన్​స్పెక్టర్ (అడ్మిన్) ధరణి కుమార్, (వెల్ఫేర్) సతీష్, రూరల్ సర్కిల్ ఇన్​స్పెక్టర్​ శ్రీనివాస్, పోలీస్ శాఖ సిబ్బంది పాల్గొన్నారు.

ఇది కూడా చదవండి..: TPCC Chief | పదేళ్ల బీఆర్​ఎస్​ అరాచక పాలనను ప్రజలు మరిచిపోలేదు : టీపీసీసీ చీఫ్​

తెలుగు జర్నలిజంలో 20 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2005లో ‘వార్త’ దినపత్రికలో స్పోర్ట్స్​ రిపోర్టర్​గా పనిచేశాను. అనంతరం రెండేళ్ల పాటు సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. 2010లో ‘సాక్షి’ జర్నలిజం స్కూల్​లో శిక్షణ పొందాను. అనంతరం ‘సాక్షి’ దినపత్రికలో సబ్​ఎడిటర్​గా చేరాను. సీనియర్​ సబ్​ ఎడిటర్​గా ప్రమోషన్​ పొందాను. 2024 నవంబర్​ నుంచి ‘అక్షరటుడే’లో చీఫ్​ సబ్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, స్థానికం, జనరల్​, క్రైం, వైరల్​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *