అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Hyderabad Water Supply | హైదరాబాద్ నగరంలో తాగునీటి ఇబ్బందులు తలెత్తకుండా జలమండలి (HMWSSB) అధికారులు కఠిన చర్యలు చేపడుతున్నారు. నీటిని దుర్వినియోగం చేస్తున్న వారికి జరిమానా వేస్తున్నారు. అలాగే అక్రమంగా నల్లాలకు మోటార్లు పెడితే సీజ్ చేస్తున్నారు.
నగరంలోని కుత్బుల్లాపూర్ జోన్‌లోని శ్రీరామ్‌నగర్ ప్రాంతం, డివిజన్-23, పద్మనగర్ వార్డులో విజిలెన్స్ అధికారులు బుధవారం తనిఖీలు నిర్వహించారు. తాగునీటి సరఫరా లైన్లకు అక్రమంగా అమర్చిన నాలుగు మోటార్లను అధికారులు గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. కుళాయిలకు అక్రమంగా మోటార్లను అమరిస్తే నిబంధనల ప్రకారం చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. పదేపదే ఈ నిబంధనను ఉల్లంఘించిన వారికి రూ.5,000 జరిమానా విధించడంతో పాటు, క్రిమినల్ కేసులు కూడా నమోదు చేస్తామన్నారు.
Hyderabad Water Supply | ప్రజలు సహకరించాలి
నల్లాలకు మోటార్లు పెడితే ఇతరులకు నీటి పంపిణీలో అంతరాయం కలుగుతుందని జలమండలి పేర్కొంది. వినియోగదారులు కుళాయిలకు మోటార్లను అమర్చవద్దని కోరింది. ఒకవేళ తక్కువ ప్రెజర్‌తో నీళ్లు వస్తే తమకు ఫిర్యాదు చేయాలని సూచించింది. ఫిర్యాదులు వెంటనే పరిష్కరిస్తామని హామీ ఇచ్చింది.
దీనిని కూడా చదవండి : Sonam Wangchuk | ఆ హామీ ఇస్తే దీక్ష విరమిస్తా.. కేంద్రానికి సోనమ్ వాంగ్‌చుక్ లేఖ