Mutyam Venkataramana Remand | రూ.300 కోట్ల అక్రమాస్తులు.. డీఈ వెంకటరమణకు రిమాండ్​

Balla Sandeep Kumar

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Mutyam Venkataramana Remand | ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో రెడ్కో డీఈ ముత్యం వెంకటరమణకు కోర్టు 14 రోజుల రిమాండ్​ విధించింది. దీంతో ఏసీబీ అధికారులు ఆయనను చంచల్​గూడ జైలుకు తరలించారు.

రెడ్కోకో డీఈగా పనిచేస్తున్న వెంకటరమణ నివాసాలలో ఏసీబీ అధికారులు (ACB Officers) బుధవారం దాడులు చేపట్టిన విషయం తెలిసిందే. ఆయనతో పాటు బంధువుల ఇళ్లలో సోదాలు చేపట్టారు. తనిఖీల సమయంలో వెంకటరమణ భారీగా అక్రమాస్తులు సంపాదించినట్లు గుర్తించారు. తన భార్య పేరిట పలు కన్​స్ట్రక్షన్​ కంపెనీలు, అనేక భవనాలు, ప్లాట్లు ఉన్నట్లు తెలిపారు. మొత్తం ఆస్తుల విలువ రూ.300 కోట్లకు పైగా ఉంటుందని అంచనా వేశారు. ఈ మేరకు బుధవారం రాత్రి నిందితుడిని అరెస్ట్ చేశారు.

Mutyam Venkataramana Remand | ఏసీబీ కోర్టులో హాజరు పర్చగా..

డీఈ ముత్యం వెంకటరమణను ఏసీబీ అధికారులు గురువారం ఉదయం నాంపల్లిలోని ఏసీబీ కోర్టులో హాజరు పర్చారు. న్యాయమూర్తి అతడికి 14 రిమాండ్​ విధించారు. దీంతో చంచల్​గూడ జైలుకు తరలించారు. కాగా ఏసీబీ అధికారులు ఆరు దశాబ్దాలకు పైబడిన చరిత్రలో అత్యంత భారీ అవినీతి కేసును వెలికితీసినట్లు అధికారులు తెలిపారు. ఎస్​పీడీసీఎల్​లో పని చేస్తున్నప్పుడు 2019లో రూ.25,000 లంచం తీసుకుంటూ రమణ గతంలో రెడ్-హ్యాండెడ్‌గా పట్టుబడ్డారు. ఆ కేసు ఇంకా విచారణ దశలోనే ఉండగా, తాజాగా ఏసీబీ జరిపిన దాడుల్లో రూ.28.14 కోట్ల (రిజిస్ట్రేషన్ విలువ ప్రకారం) అక్రమ ఆస్తులు బయటపడ్డాయి. ఇది గతంలో ఆర్​అండ్​బీ ఈఎన్​సీకి సంబంధించి నమోదైన రూ.17.94 కోట్ల రికార్డును అధిగమించింది. కాగా డీఈ ఆస్తులు మార్కెట్​ విలువ ప్రకారం రూ.300 కోట్లకు పైగా ఉంటాయని అంచనా..

ఇది కూడా చదవండి..: Indiramma Houses | త్వరలో రెండో విడత ఇందిరమ్మ ఇళ్లు!

Author Bio : తెలుగు జర్నలిజంలో 19 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2007 డిసెంబర్​లో ‘సాక్షి’ దినపత్రికలో జూనియర్​ ఆర్టిస్ట్​గా చేరాను. 2010లో జర్నలిజంలో శిక్షణ పొంది సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. అనంతరం నమస్తే తెలంగాణ దినపత్రికలో 2011లో చేరి రెండు సంవత్సరాల పాటు పనిచేశాను. ఆ తర్వాత ‘సాక్షి’ దినపత్రికలో 2013 నుంచి 2024 జూలై వరకు సీనియర్​ సబ్​ ఎడిటర్​గా వర్క్​ చేశాను. 2024 ఆగస్టు నుంచి ‘అక్షరటుడే’లో అసోసియేట్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, లోకల్​, నేషనల్​, ఇంటర్నేషనల్​, క్రైం, లైఫ్​స్టైల్​, సినిమా ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *