Junior Colleges | కళాశాలల్లో మరమ్మతు పనులు పూర్తిచేయాలి

జిల్లాలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలకు మంజూరైన నిధులతో త్వరగా సివిల్, ఎలక్ట్రికల్ పనులను పూర్తి చేయాలని డీఐఈవో రవికుమార్​ పేర్కొన్నారు.

shashi kiran Mottala

అక్షరటుడే, నిజామాబాద్​ సిటీ: Junior Colleges | జిల్లా (Nizamabad)లోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలకు మంజూరైన నిధులతో త్వరగా సివిల్, ఎలక్ట్రికల్ పనులను పూర్తి చేయాలని డీఐఈవో రవికుమార్​ పేర్కొన్నారు. శుక్రవారం  డీఐఈవో కార్యాలయంలో ప్రభుత్వ జూనియర్ కళాశాలల ప్రిన్సిపాళ్లతో సమావేశం నిర్వహించారు.

Junior Colleges | కొనుగోలు చేయాలి

కళాశాలల్లో ఎలక్ట్రికల్, ఇతర మరమ్మతులకు అవసరమైన సామగ్రి కొనుగోళ్లను వెంటనే పూర్తిచేయాలని డీఐఈవో పేర్కొన్నారు. అలాగే కళాశాలలో విద్యార్థులు కూర్చునే ఫర్నిచర్​కు సైతం మరమ్మతులు చేయించాలన్నారు. ఇంటర్ బోర్డు కమిషనర్ ఆదేశాల మేరకు ప్రిన్సిపాళ్లకు లెక్చరర్లకు శిక్షణ తరగతులు నిర్వహిస్తామని తెలిపారు. ఈ శిక్షణ తరగతులకు అధ్యాపకులకు కేటాయించిన తేదీల్లో హాజరయ్యే విధంగా ప్రిన్సిపాళ్లు తగిచర్యలు తీసుకోవాలని డీఈఐవో ఆదేశించారు.

ఈ విద్యా సంవత్సరంలో మరిన్ని అడ్మిషన్లను పెంచేందుకు గాను కళాశాల ప్రిన్సిపల్స్​, అధ్యాపకులు సమన్వయంతో కృషి చేయాలని సూచించారు. ఇదివరకే అడ్మిషన్లు ఆయిన విద్యార్థుల యూడైస్​, ఆధార్ అప్డేట్​లు వెంట వెంటనే చేయించాలని ఆదేశించారు. అధ్యాపకుల కొరత ఉన్న కళాశాలల్లో వెంటనే అతిథి అధ్యాపకులను నియమించేందుకు చర్యలు తీసుకుంటామన్నారు.బోధన, బోధనేతర సిబ్బంది ఖచ్చితంగా సమయపాలన పాటించే విధంగా చర్యలు తీసుకోవాలని సూచించారు.

ఇది కూడా చదవండి..: Land Acquisition | జాప్యం లేకుండా భూసేకరణ చేపట్టాలి..: కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్

తెలుగు జర్నలిజంలో 20 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2005లో ‘వార్త’ దినపత్రికలో స్పోర్ట్స్​ రిపోర్టర్​గా పనిచేశాను. అనంతరం రెండేళ్ల పాటు సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. 2010లో ‘సాక్షి’ జర్నలిజం స్కూల్​లో శిక్షణ పొందాను. అనంతరం ‘సాక్షి’ దినపత్రికలో సబ్​ఎడిటర్​గా చేరాను. సీనియర్​ సబ్​ ఎడిటర్​గా ప్రమోషన్​ పొందాను. 2024 నవంబర్​ నుంచి ‘అక్షరటుడే’లో చీఫ్​ సబ్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, స్థానికం, జనరల్​, క్రైం, వైరల్​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *