అక్షరటుడే, కామారెడ్డి : Home Guard Ex Gratia | విధి నిర్వహణలో మరణించిన హోంగార్డు కుటుంబానికి తెలంగాణ ప్రభుత్వం ఎక్స్గ్రేషియాను ప్రకటించింది. కామారెడ్డి(Kamareddy) జిల్లాకు చెందిన హోంగార్డ్ శ్రీనివాస్ గతేడాది మరణించారు.
Home Guard Ex Gratia | ఎస్పీ కార్యాలయంలో..
ఆయన కుటుంబానికి ప్రభుత్వం మంజూరు చేసిన రూ.5లక్షల ఎక్స్గ్రేషియాను శ్రీనివాస్ భార్య రేఖ బ్యాంకు ఖాతాలో జమచేశారు. ఈ మేరకు రేఖ శుక్రవారం జిల్లా పోలీస్ కార్యాలయంలో ఎస్పీ రాజేష్చంద్రను ( SP Rajesh Chandra) కలిశారు. ఎక్స్గ్రేషియా సాయం అందేలా చర్యలు తీసుకున్న తెలంగాణ ప్రభుత్వానికి, పోలీసు శాఖకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా ఎస్పీ రాజేష్ చంద్ర మాట్లాడుతూ విధి నిర్వహణలో సేవలందించిన హోంగార్డుల కుటుంబాల సంక్షేమంపై తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ చూపుతోందన్నారు.
మరణించిన హోంగార్డుల కుటుంబాలకు ప్రభుత్వం ఎల్లప్పుడూ అండగా ఉంటుందని, పోలీసు శాఖ తరపున అవసరమైన సహాయ సహకారాలు నిరంతరం అందిస్తామని భరోసా ఇచ్చారు. కుటుంబ సభ్యులు ధైర్యంగా ఉండాలని సూచించిన ఆయన, ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాల ప్రయోజనాలు వారికి సకాలంలో అందేలా సంబంధిత అధికారులు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.