అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Rajagopal Reddy Counter | తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల సామేల్‌కు మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్రెడ్డి (Komatireddy Rajagopal Reddy) కౌంటర్ ఇచ్చారు. ఆయనను గెలిపించి తప్పు చేశానని పేర్కొన్నారు.
మందుల సామేలు శుక్రవారం మీడియా సమావేశంలో కోమటిరెడ్డి సోదరులకు వార్నింగ్ ఇచ్చిన విషయం తెలిసిందే. తన నియోజకవర్గ రాజకీయాల్లో తలదూర్చొద్దని వారిని హెచ్చరించారు. తాను కష్టపడి గెలిచానని కోమటిరెడ్డి దగ్గరకు వెళ్లలేదన్నారు. ఈ వ్యాఖ్యలకు రాజగోపాల్రెడ్డి స్పందించారు. తుంగతుర్తి కాంగ్రెస్ కార్యకర్తలకు ఆయన క్షమాపణ చెప్పారు. తప్పుడు వ్యక్తిని బరిలోకి దింపి గెలిపించానని సంచలన వ్యాఖ్యలు చేశారు.
Rajagopal Reddy Counter | మా ఇంటికి వంద సార్లు వచ్చాడు
టికెట్ కోసం మందుల సామేలు తన ఇంటికి వంద సార్లు వచ్చారని కోమటిరెడ్డి అన్నారు. చాలామంది పోటీపడినా మాటిచ్చానని సామేలుకు టికెట్ ఇప్పించి గెలిపించానని తెలిపారు. ఆయారాం, గయారాంలకు తాను భయపడనని పేర్కొన్నారు. తాను ఎవరికి వ్యతిరేకం కాదని తెలిపారు. బీఆర్ఎస్ నుంచి వచ్చినవాళ్లను గౌరవించానని చెప్పారు.
ఇద్దరు ఎమ్మెల్యేల మధ్య మాటల యుద్ధం ఉమ్మడి నల్గొండ జిల్లా కాంగ్రెస్‌లో తీవ్ర చర్చకు దారి తీసింది. ఇప్పటికే కాంగ్రెస్‌లో వర్గపోరు నెలకొంది. వరంగల్‌లో నేతల మధ్య పొసగడం లేదు. మరోవైపు ఇతర జిల్లాల్లో సైతం పలువురు నాయకుల మధ్య విభేదాలు ఉన్నాయి. తాజాగా నల్గొండలో మరో పంచాయితీ తెరపైకి వచ్చింది. దీనిపై కాంగ్రెస్ అధిష్టానం, పార్టీ పెద్దలు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో చూడాలి.
దీనని కూడా చదవండి : Mandula Samuel Warning | కోమటిరెడ్డి బ్రదర్స్‌కు వార్నింగ్ ఇచ్చిన కాంగ్రెస్ ఎమ్మెల్యే