అక్షరటుడే, నిజామాబాద్ సిటీ: Kargil Vijay Diwas Rally | కార్గిల్ విజయ్ దివస్ సందర్భంగా నగరంలో(Nizamabad) ఏబీవీపీ (ABVP) ఆధ్వర్యంలో కాగడాల ర్యాలీ (Torch Rally) నిర్వహించారు. ఎన్టీఆర్ చౌరస్తా నుంచి ఎల్లమ్మగుట్ట చౌరస్తాలోని కార్గిల్ విజయస్థూపం వరకు ఈ ర్యాలీ జరిగింది.
Kargil Vijay Diwas Rally | అమరవీరులకు ఘననివాళి
ఈ సందర్భంగా ఏబీవీపీ నాయకుడు నవీన్ మాట్లాడుతూ.. కార్గిల్ వీరుల అమరత్వాన్ని దేశం ఎన్నటికీ మరిచిపోలేరన్నారు. వారు చూపిన అసమాన ధైర్యసాహసాలు దేశప్రజల గుండెల్లో నిలిచిపోయాయని పేర్కొన్నారు. దేశం కోసం పోరాడేందుకు ప్రతిఒక్కరూ సంసిద్ధంగా ఉండాలని పేర్కొన్నారు. కార్యక్రమంలో పలువురు విద్యార్థులు, ఏబీవీపీ కార్యకర్తలు పాల్గొన్నారు.
ఇది కూడా చదవండి: ‘నందన్ నీలేకని నాయకత్వంలో పరీక్షా సంస్కరణలపై ఉన్నత స్థాయి టాస్క్ ఫోర్స్ ఏర్పాటు’ – ప్రధాని మోదీ