అక్షరటుడే, భీమ్గల్: Vinayaka Temple Reconstruction | పట్టణంలో (Bheemgal) స్వయంభువుగా వెలసిన వినాయక ఆలయ పునర్నిర్మాణానికి మున్నూరు కాపు ఫౌండేషన్(Munnuru Kapu Foundation) సభ్యులు విరాళం అందజేశారు. రజక సంఘం ఆధ్వర్యంలో ఈ నిర్మాణం జరుగుతోంది.
Vinayaka Temple Reconstruction | రూ.50 వేలు అందజేత
శిథిలావస్థకు చేరిన ఈ ఆలయ నిర్మాణ పనులను రజక సంఘం ఆధ్వర్యంలో చేపట్టారు. పలువురు దాతలు తమ వంతు సాయం అందిస్తున్నారు. ఈ క్రమంలో ఫౌండేషన్ ప్రతినిధులు రూ. 50,000 విరాళం చెక్కును రజక సంఘం ప్రతినిధులకు సోమవారం అందజేశారు. ఈ సందర్భంగా ఫౌండేషన్ సభ్యులు మాట్లాడుతూ.. ఆధ్యాత్మిక, సామాజిక సేవా కార్యక్రమాలకు తమ సంస్థ ఎల్లప్పుడు అండగా ఉంటుందని తెలిపారు. సాయం అందించిన ఫౌండేషన్ ప్రతినిధులకు రజక సంఘం నాయకులు కృతజ్ఞతలు తెలుపుతూ, మిగతా దాతలు కూడా ఆలయ నిర్మాణానికి సహకరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్ నీలం రవి, నాయకులు బోదిరే నర్సయ్య, తేజ, చరణ్, అరవింద్, నవీన్, ప్రదీప్, సతీష్, విశాల్, రజక సంఘం సభ్యులు పాల్గొన్నారు.
ఇది కూడా చదవండి: తెలంగాణ హైకోర్టు సంచలన ఆదేశాలు