అక్షరటుడే, నిజామాబాద్ క్రైం: Gambling Raid | పేకాట స్థావరాలపై చీతా ఫోర్స్ వరుస దాడులకు పాల్పడుతోంది. పక్కా సమాచారం మేరకు సంఘటన స్థలానికి చేరుకుంటున్న పోలీసులు పలువురిని అదుపులోకి తీసుకుంటున్నారు.
Gambling Raid | నాల్గో టౌన్ పరిధిలో..
నగరం (Nizamabad)లోని 4వ టౌన్ పరిధిలోని మార్కండేయ గుడి వద్ద ఓ ఇంట్లో సోమవారం అర్ధరాత్రి పేకాట ఆడుతున్నారని సమాచారం మేరకు చీతాఫోర్స్ దాడి చేసింది. ఈ దాడిలో ఏడుగురు వ్యక్తులను అదుపులోకి తీసుకున్న సిబ్బంది రూ.47,350, ఏడు సెల్ఫోన్లను సైతం స్వాధీనం చేసుకున్నారు. అనంతరం వారిని తదుపరి చర్యల నిమిత్తం నాలుగో టౌన్ ఎస్‌హెచ్‌వో సతీష్‌కు అప్పజెప్పారు. ఈ సందర్భంగా పోలీసులు మాట్లాడుతూ ఎక్కడైనా పేకాట ఆడుతున్నట్టుగా సమాచారం తెలిస్తే డయల్ 100కు, లేదా స్థానిక పోలీసులకు సమాచారం అందించాలని వారిపై వారిపై చట్టరీత్యా చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు.
ఇది కూడా చదవండి..: Bladder Stone Surgery | ఎల్లారెడ్డి ఆస్పత్రిలో అరుదైన శస్త్రచికిత్స..యూరినరీ బ్లాడర్ నుంచి 400 గ్రాముల రాయి తొలగింపు