Ajinkya Rahane Retirement | క్రికెట్‌కు రిటైర్మెంట్​ ప్రకటించిన అజింక్య రహానే

భారత ​ క్రికెటర్​ అజింక్య రహానే అన్ని ఫార్మాట్​లకు వీడ్కోలు పలికారు.

Srinivas Kolluri

అక్షరటుడే, వెబ్​డెస్క్: Ajinkya Rahane Retirement | భారత సీనియర్​ క్రికెటర్​ అజింక్య రహానే క్రికెట్​కు రిటైర్మెంట్ ప్రకటించారు. ఈ మేరకు గురువారం ఆయన సోషల్​ మీడియా వేదికగా వీడియో విడుదల చేశారు. టీమ్ ఇండియా (Team India) తరఫున దశాబ్దానికి పైగా సాగిన తన అద్భుతమైన కెరీర్‌కు ముగింపు పలికారు.

అంజిక్య రహానే కొంతకాలంగా ఫామ్​ లేక ఇబ్బంది పడుతున్నారు. దీంతో భారత సెలెక్టర్లు ఆయనను పక్కన పెట్టారు. ఈ క్రమంలో ఆయన తన రిటైర్మెంట్​ ప్రకటించారు. తన బ్యాటింగ్​తో ఆకట్టుకునే రహానేకు విదేశీ పిచ్​లపై మంచి రికార్డు ఉంది. అతడు 85 టెస్టులు, 90 వన్డేలు, 20 టీ20లలో భారత్​కు ప్రాతినిధ్యం వహించాడు. మొత్తం 8 వేలకు పైగా పరుగులు సాధించాడు. రహానే కెప్టెన్సీలో 2020-21 భారత్​ బోర్డర్-గవాస్కర్ ట్రోఫీని గెలుచుకుంది. గాయాలతో సతమతమవుతున్న భారత జట్టుకు నాయకత్వం వహించడంతో పాటు మెల్‌బోర్న్‌లో సెంచరీ సాధించి ఆస్ట్రేలియా గడ్డపై చారిత్రాత్మక 2-1 టెస్టు సిరీస్ విజయాన్ని అందించారు.

Ajinkya Rahane Retirement | 2023లో చివరి టెస్ట్..

రహానే 2023లో చివరిసారిగా భారత్ తరఫున టెస్ట్ మ్యాచ్​ ఆడారు. వన్డే ఫార్మాట్‌లో ఆయన చివరి ప్రదర్శన 2018లో ఇంగ్లాండ్‌తో జరిగింది. టీ20 ఆఖరి మ్యాచ్​ను 2016లో వెస్టిండీస్‌తో ఆడాడు. “క్యాప్ నంబర్ 278 సెలవు తీసుకుంటోంది. ఇన్నాళ్లూ మీరు చూపిన ప్రేమ, మద్దతుకు ధన్యవాదాలు” అని రహానే తన ఇన్‌స్టాగ్రామ్ వీడియోకు క్యాప్షన్ ఇచ్చారు. కొంతకాలంగా భారత జట్టుకు దూరం అయినప్పటికి రహానే ఐపీఎల్​లో ఆడుతున్నారు. రెండు సీజన్లలో కోల్‌కతా నైట్ రైడర్స్ (KKR) జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరించారు.

ఇది కూడా చదవండి..: India Sri Lanka Test Squad | శ్రీలంక టెస్ట్ సిరీస్​ కోసం భారత జట్టు ప్రకటన

తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *