Sriram Sagar Project | శ్రీరాంసాగర్​కు ఎగువన భారీవర్షాలు.. క్రమంగా పెరుగుతున్న నీటిమట్టం

మహారాష్ట్రలో కురుస్తున్న వర్షాలకు ఎస్సారెస్పీకి భారీ వరద వచ్చి చేరుతోంది. దీంతో ప్రాజెక్టు నీటి మట్టం క్రమంగా పెరుగుతోంది.

shashi kiran Mottala

అక్షరటుడే, మెండోరా: Sriram Sagar Project | శ్రీరాంసాగర్​ ప్రాజెక్టు ఎగువన మహారాష్ట్ర (Maharashtra)లో జోరుగా వానలు కురుస్తున్నాయి. జిల్లాలోనూ అలాగే నాలుగైదురోజులు వర్షాలు పడుతున్నాయి. దీంతో ఎస్సారెస్పీకి వరద భారీగా వచ్చి చేరుతోంది.

Sriram Sagar Project | విష్ణుపురి, బాలేగావ్​ ప్రాంతాల నుంచి..

మహారాష్ట్రలోని విష్ణుపురి, బాలేగావ్​ ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో ప్రస్తుతం శ్రీరాంసాగర్ ప్రాజెక్టులోకి 84,998 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో వస్తోంది. ప్రాజెక్టు పూర్తి నీటిమట్టం 1,091 అడుగులు, పూర్తి సామర్థ్యం 80.50 టీఎంసీలు కాగా, ప్రస్తుతం 1,071.90 అడుగుల వద్ద 26.567 టీఎంసీల నీటి నిల్వ ఉంది. గతేడాది ఇదే సమయానికి ప్రాజెక్టులో 1,077.60 అడుగుల వద్ద 38.799 టీఎంసీల నీటి నిల్వ ఉండగా, ప్రస్తుతం సుమారు 12 టీఎంసీల మేర నీటి నిల్వ తక్కువగా ఉంది.

ప్రాజెక్ట్​ నుంచి..

ప్రస్తుతం ప్రాజెక్టు నుంచి కాకతీయ కాలువ ద్వారా 300 క్యూసెక్కులు, మిషన్ భగీరథకు 231 క్యూసెక్కులు, ఆవిరి రూపంలో 291 క్యూసెక్కులు కలిపి మొత్తం 822 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. ప్రాజెక్టులోకి వరద నీరు పెరుగుతుండటంతో శ్రీరాంసాగర్ ఆయకట్టు పరిధిలోని రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. వరద పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ అవసరమైన చర్యలు చేపడుతున్నట్లు ప్రాజెక్ట్​ ఏఈ కొత్త రవి పేర్కొన్నారు.

ఇది కూడా చదవండి..: Sriram Sagar Project | శ్రీరాంసాగర్ ప్రాజెక్టుకు పర్యాటక శోభ సంతరించుకునేనా..!?

తెలుగు జర్నలిజంలో 20 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2005లో ‘వార్త’ దినపత్రికలో స్పోర్ట్స్​ రిపోర్టర్​గా పనిచేశాను. అనంతరం రెండేళ్ల పాటు సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. 2010లో ‘సాక్షి’ జర్నలిజం స్కూల్​లో శిక్షణ పొందాను. అనంతరం ‘సాక్షి’ దినపత్రికలో సబ్​ఎడిటర్​గా చేరాను. సీనియర్​ సబ్​ ఎడిటర్​గా ప్రమోషన్​ పొందాను. 2024 నవంబర్​ నుంచి ‘అక్షరటుడే’లో చీఫ్​ సబ్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, స్థానికం, జనరల్​, క్రైం, వైరల్​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *