అక్షరటుడే, నిజామాబాద్ అర్బన్: Chess Tournament | చెస్ ఆడితే ఏకాగ్రత పెరుగుతుందని ఒలింపిక్ అసోసియేషన్ (Olympic Association) జిల్లా కార్యదర్శి బొబ్బిలి నర్సయ్య అన్నారు. జిల్లాస్థాయి చెస్ అండర్–13 పోటీలు నగరంలోని(Nizamabad) ‘అభ్యాస ద స్కూల్’లో (Abhyasa The School) నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఆయన హాజరై మాట్లాడారు.
Chess Tournament | నిత్యం సాధన చేయాలి
చిన్నతనం నుంచే విద్యార్థులు చెస్ ఆడితే పిల్లల్లో ఏకాగ్రత పెరిగి, చదువులోనూ ముందంజలో ఉంటారని బొబ్బిలి నర్సయ్య అన్నారు. ప్రతిరోజూ సాధన చేయడం ద్వారా చెస్ క్రీడతో పాటు శారీరక, మానసిక అభివృద్ధిని సాధించవచ్చని పేర్కొన్నారు. ఈ సందర్భంగా విజేతలకు బహుమతులు అందజేశారు. విజేతలు.. బాలుర విభాగంలో ప్రథమ స్థానంలో గౌరంగా అశోక్ (ఆచార్య విద్యాలయం, బోధన్), ద్వితీయ స్థానంలో డి. సోహన్ (మోడల్ స్కూల్, ఆర్మూర్) నిలిచారు. అలాగే బాలికల విభాగంలో ప్రథమ స్థానంలో బి.హరిణి (శ్రీ చైతన్య), ద్వితీయ స్థానంలో ఆర్.అభిజ్ఞ (అభ్యాస ద స్కూల్) ఉన్నారు. ఈ కార్యక్రమంలో వెయిట్‌లిఫ్టింగ్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి అబ్బాపూర్ రవీందర్, చెస్ అసోసియేషన్ ప్రతినిధులు ఏ. రమేష్, నాగరాజు, మధుకర్, చీఫ్ ఆర్బిటర్ శివ సాయిబాబా తదితరులు పాల్గొన్నారు.
ఇది కూడా చదవండి: Devi Sri Prasad as ‘PARSHI’ in… #YELLAMMA