PCC Chief | హరీశ్​రావు క్షుద్ర పూజలు చేశారు : పీసీసీ చీఫ్​ మహేశ్​గౌడ్​

హరీశ్​రావుపై పీసీసీ చీఫ్​ మహేశ్​కుమార్​ గౌడ్​ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆయన క్షుద్ర పూజలు చేస్తున్నారని ఆరోపించారు.

Srinivas Kolluri

అక్షరటుడే, వెబ్​డెస్క్: PCC Chief | బీఆర్​ఎస్​ మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీశ్​రావు (Harish Rao)పై పీసీసీ చీఫ్​ మహేశ్​కుమార్​ గౌడ్​ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆయన క్షుద్ర పూజలు చేస్తున్నారని ఆరోపించారు.

గాంధీ భవన్​లో మంగళవారం మహేశ్​గౌడ్​ మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో వర్షాలు పడొద్దు, కరువు రావాలని హరీశ్​రావు పూజలు చేస్తున్నారని ఆరోపించారు. తమ దగ్గర అన్ని ఆధారాలు ఉన్నాయని చెప్పారు. వాళ్లకు రాష్ట్రం, ప్రజలు ఏమైపోపోయినా పర్వాలేదన్నారు. అరుంధతి సినిమాలో పశుపతిలా హరీశ్​ వ్యవహరిస్తున్నారని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్​ ఫాంహౌస్‌లో క్షుద్రపూజలు చేయించారనే ప్రచారం ఇప్పుడు నిజమే అనిపిస్తుందన్నారు.

PCC Chief | అప్పుడు ఎక్కడికి వెళ్లారు

హరీశ్ రావు మార్చి 2న తమిళనాడులోని తిరుచ్చికి, జూన్ 1న కర్ణాటకలోని శివమొగ్గకు వెళ్లారని మహేశ్​గౌడ్​ తెలిపారు. అక్కడకు ఎందుకు వెళ్లారో ప్రజలకు చెప్పాలని డిమాండ్​ చేశారు. తిరుపతి వెళ్లిన సమయంలో కూడా అఘోరీ ఆలయానికి వెళ్లిన విషయాన్ని ఎందుకు గోప్యంగా ఉంచారని ప్రశ్నించారు. అందరు ప్రజల బాగు కోసం పూజలు చేస్తే.. ఆయన మాత్రం ప్రజలకు కీడు జరగాలని పూజలు చేశారని ఆరోపించారు.

ఇది కూడా చదవండి..: MBBS BDS Admission | ఎంబీబీఎస్, బీడీఎస్ ప్రవేశాలకు నోటిఫికేషన్

తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.
1 Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *