అక్షరటుడే, నిజామాబాద్ సిటీ: Hydraulic Lifter Services | నగరంలోని (Nizamabad) విద్యుత్ సరఫరాలో అంతరాయాల పరిష్కారానికి హైడ్రాలిక్ లిఫ్టర్ వాహనం సేవలు ప్రారంభించినట్లు ట్రాన్స్‌కో (TRANSCO) ఎస్ఈ పీవీ రాజేశ్వర్‌రావు పేర్కొన్నారు. ఈ మేరకు పవర్‌హౌస్‌లో వాహనాలను తనిఖీ చేశారు.
Hydraulic Lifter Services | వినియోగదారులకు మెరుగైన సేవలు
ఆయన మాట్లాడుతూ.. వినియోగదారులకు మెరుగైన సేవలు అందించేందుకు ఎల్లప్పుడూ ట్రాన్స్‌కో సిద్ధంగా ఉంటుందని పేర్కొన్నారు. వినియోగదారులకు నాణ్యమైన, వేగవంతమైన విద్యుత్ సేవలను అందించాలనే లక్ష్యంతో టీజీఎన్పీడీసీఎల్, నిజామాబాద్ ఆపరేషన్ సర్కిల్ పరిధిలో టాటా యోధా 3.0 ఎంటీ హైడ్రాలిక్ లిఫ్టర్ వాహనాన్ని తీసుకువచ్చినట్లు తెలిపారు. ఈ వాహనం ద్వారా 33 కేవీ, 11 కేవీ విద్యుత్ లైన్ల బ్రేక్డౌన్లు, ఫ్యూజ్ ఆఫ్ కాల్స్ (FOC), చెట్ల కొమ్మల తొలగింపు, ఎత్తైన ప్రాంతాల్లో విద్యుత్ లైన్లు, పరికరాల నిర్వహణ పనులు సురక్షితంగా, వేగంగా చేపట్టేందుకు వీలు కలుగుతుందని తెలిపారు.
ప్రత్యేకించి నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో విద్యుత్ అంతరాయాలు సంభవించినప్పుడు తక్షణమే స్పందించి విద్యుత్ సరఫరాను త్వరితగతిన పునరుద్ధరించడంతో పాటు, విద్యుత్ సిబ్బంది భద్రతతో పనులు నిర్వహించేందుకు ఈ హైడ్రాలిక్ లిఫ్టర్ వాహనం ఎంతో ఉపయోగపడుతుందని తెలిపారు. కార్యక్రమంలో డీఈఎస్ శ్రీనివాస్‌రావు, డీ వెంకట రమణ, ఏఈడీఎస్ చంద్రశేఖర్, ప్రసాద్ రెడ్డి, వినోద్, శ్రీధర్, తోట రాజశేఖర్, ఏఈఎస్ నగేష్, కాశీనాథ్, సుమిత, నాయకులు రఘునందర్, పూదరి గంగాధర్, గంగారాం నాయక్, చెన్నయ్య, శ్రీనివాస్, ఏఈవో శ్రీనివాస్, ఎస్ఐ, డీవన్ సిబ్బంది, ఎస్ఈ కార్యాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
ఇది కూడా చదవండి: LIC Share Price | ఎల్ఐసీకి ఏమయ్యింది?.. భారీగా పతనమైన షేరు ధర