Ganja Smuggling | ఇద్దరు గంజాయి విక్రేతల అరెస్ట్​

నగరంలో గంజాయి విక్రయిస్తున్న ఇద్దరిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ మేరకు ఆరో టౌన్​ ఎస్సై సందీప్​ గురువారం వివరాలు వెల్లడించారు.

shashi kiran Mottala

అక్షరటుడే, నిజామాబాద్​ సిటీ : Ganja Smuggling | నగరంలో గంజాయి విక్రయిస్తున్న ఇద్దరిని పోలీసులు (Nizamabad Police) అదుపులోకి తీసుకున్నారు. ఈ మేరకు ఆరో టౌన్​ ఎస్సై సందీప్​ గురువారం వివరాలు వెల్లడించారు.

Ganja Smuggling | నెహ్రూనగర్​లో..

నగరంలోని ఆరో పోలీస్​స్టేషన్​ పరిధిలోని నెహ్రూనగర్​ శివారులో ఇద్దరు వ్యక్తులు గంజాయి విక్రయిస్తున్నారనే సమాచారంతో పోలీసులు దాడులు నిర్వహించారు. ఈ క్రమంలో ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు. వారిద్దరు నాందేడ్​లో గంజాయి ప్యాకెట్లు కొని నిజామాబాద్​ శివార్లలో విక్రయిస్తున్నట్లుగా తెలిసిందన్నారు. వారి వద్ద నుంచి 60గ్రాముల గంజాయి, రెండు సెల్​ఫోన్లు, ఒక ఆటోను స్వాధీనం (Cannabis Seizure) చేసుకున్నట్లు తెలిపారు. అనంతరం వారిని రిమాండ్​కు తరలించామన్నారు. ఎస్సై నారాయణ సింగ్​, సిబ్బంది పాల్గొన్నారు.

ఇది కూడా చదవండి: Mahesh Kumar Goud | దమ్ముంటే నా ఆడియోలు, వీడియోలు బయటపెట్టాలి: పీసీసీ చీఫ్

తెలుగు జర్నలిజంలో 20 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2005లో ‘వార్త’ దినపత్రికలో స్పోర్ట్స్​ రిపోర్టర్​గా పనిచేశాను. అనంతరం రెండేళ్ల పాటు సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. 2010లో ‘సాక్షి’ జర్నలిజం స్కూల్​లో శిక్షణ పొందాను. అనంతరం ‘సాక్షి’ దినపత్రికలో సబ్​ఎడిటర్​గా చేరాను. సీనియర్​ సబ్​ ఎడిటర్​గా ప్రమోషన్​ పొందాను. 2024 నవంబర్​ నుంచి ‘అక్షరటుడే’లో చీఫ్​ సబ్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, స్థానికం, జనరల్​, క్రైం, వైరల్​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
1 Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *