అక్షరటుడే, మెండోరా : Sriramsagar Project | శ్రీరాంసాగర్ (పోచంపాడ్) ప్రాజెక్టుకు వరద ప్రవాహం క్రమక్రమంగా తగ్గుతోంది. ఎగువన మహారాష్ట్ర (Maharashtra)లో వర్షాలు తగ్గడం.. జిల్లాలోనూ తగ్గుముఖం పట్టడంతో జలాశయానికి ఇన్‌ఫ్లో తగ్గింది.
Sriramsagar Project | 5,851 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో..
ప్రస్తుతం శ్రీరాంసాగర్ ప్రాజెక్టులోకి 5,851 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో వస్తోంది. ప్రాజెక్టు పూర్తి నీటిమట్టం 1,091 అడుగులు, పూర్తి సామర్థ్యం 80.5 టీఎంసీలు కాగా, ప్రస్తుతం 1,079.30 అడుగుల వద్ద 43.091 టీఎంసీల నీటి నిల్వ ఉంది. ప్రస్తుతం ప్రాజెక్టు నుంచి కాకతీయ కాలువ ద్వారా 300 క్యూసెక్కులు, మిషన్ భగీరథకు 231 క్యూసెక్కులు, ఆవిరి రూపంలో 482 క్యూసెక్కులు నీళ్లు బయటకు వెళ్తున్నాయి. వర్షాలు తగ్గుముఖం పట్టడంతో ప్రాజెక్ట్‌లోకి గణనీయంగా ఇన్‌ఫ్లో తగ్గిపోయింది. అధికారులు ప్రాజెక్టులోకి వస్తున్న వరద ప్రవాహాన్ని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు.
ఇది కూడా చదవండి..: Har Ghar Tiranga | ప్రతి ఇంటిపై జాతీయ జెండా ఎగరాలి : యెండల లక్ష్మీనారాయణ