Nandipet CCTV Cameras | నిఘా నేత్రాలతో గ్రామాలకు భద్రత..

గ్రామాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవడం వల్ల గ్రామాలు కట్టుదిట్టమైన నిఘాలో ఉంటాయని ఎస్సై వినయ్​కుమార్​ అన్నారు.

shashi kiran Mottala

అక్షరటుడే, నందిపేట్: Nandipet CCTV Cameras | సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవడం వల్ల గ్రామాలు కట్టుదిట్టమైన నిఘాలో (Nizamabad Police) ఉంటాయని ఎస్సై వినయ్​కుమార్​ తెలిపారు. మండలంలోని వన్నెల్​(కే) గ్రామంలో సీపీ సాయిచైతన్య (CP Sai Chaitanya) ఆదేశాల మేరకు ‘మన ఊరు – మన భద్రత – మన బాధ్యత’ కార్యక్రమాన్ని నిర్వహించారు.

Nandipet CCTV Cameras | 11 సీసీ కెమెరాల ఏర్పాటు..

‘మన ఊరు – మన భద్రత – మన బాధ్యత’ కార్యక్రమంలో భాగంగా గ్రామంలో సీసీ కెమెరాలను ఏర్పాటు చేసి.. వాటి పనితీరును గ్రామస్థులకు ఎస్సై వివరించారు. ఎవరైనా అనుమానిత వ్యక్తులు సంచరిస్తే వెంటనే పోలీస్​స్టేషన్​కు సమాచారం అందించాలని సూచించారు. సైబర్ నేరగాళ్లతో అప్రమత్తంగా ఉండాలని.. బ్యాంకు వివరాలు ఎట్టి పరిస్థితుల్లో ఎవరికీ చెప్పవద్దన్నారు.

Nandipet CCTV Cameras | డ్రంకన్​ డ్రైవ్​ కేసులో ఐదుగురికి జైలు..

నందిపేట్​ మండల పరిధిలో డ్రంకన్​ డ్రైవ్​ కేసులో ఐదుగురికి న్యాయస్థానం జైలుశిక్ష విధించినట్లు ఎస్సై వినయ్​ కుమార్​ పేర్కొన్నారు. గ్రామానికి చెందిన టెక్ సాయిలు, గోసం చిన్నయ్య, న్యాల్​కల్​ గ్రామానికి చెందిన వరికొప్పుల అశోక్​కు ఐదు రోజులు చొప్పున, సాయిలుకు నాలుగు రోజులు, నవీపేట్ గ్రామానికి చెందిన బొమ్మల రాజుకు మూడు రోజులు జైలు శిక్ష విధించారని ఆయన పేర్కొన్నారు. తాగి వాహనాలు నడపడం చట్టం చట్టరీత్యా నేరం అని.. మద్యం సేవించి వాహనాలు నడిపితే కేసులు నమోదు చేయడం జరుగుతుందని ఎస్సై వినయ్ కుమార్ తెలిపారు. team 1

ఇది కూడా చదవండి: Lal Darwaza Bonalu | లాల్‌దర్వాజ బోనాల్లో 116 మంది అనుమానితుల అరెస్ట్

తెలుగు జర్నలిజంలో 20 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2005లో ‘వార్త’ దినపత్రికలో స్పోర్ట్స్​ రిపోర్టర్​గా పనిచేశాను. అనంతరం రెండేళ్ల పాటు సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. 2010లో ‘సాక్షి’ జర్నలిజం స్కూల్​లో శిక్షణ పొందాను. అనంతరం ‘సాక్షి’ దినపత్రికలో సబ్​ఎడిటర్​గా చేరాను. సీనియర్​ సబ్​ ఎడిటర్​గా ప్రమోషన్​ పొందాను. 2024 నవంబర్​ నుంచి ‘అక్షరటుడే’లో చీఫ్​ సబ్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, స్థానికం, జనరల్​, క్రైం, వైరల్​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *