Bodhan Crime Control | బోధన్ డివిజన్​లో నేరాల నియంత్రణకు కృషి చేయాలి: సీపీ సాయి చైతన్య

బోధన్ డివిజన్ పరిధిలో నేరాల నియంత్రణకు కృషి చేయాలని సీపీ సాయి చైతన్య పేర్కొన్నారు. కోటగిరి పోలీస్ స్టేషన్​లో పెండింగ్​ కేసులపై సమీక్ష నిర్వహించారు.

shashi kiran Mottala

అక్షరటుడే, బోధన్: Bodhan Crime Control | బోధన్ డివిజన్ పరిధిలో నేరాల నియంత్రణకు కృషి చేయాలని సీపీ సాయి చైతన్య (CP Sai Chaitanya) పేర్కొన్నారు. బుధవారం కోటగిరి పోలీస్ స్టేషన్​లో పెండింగ్​ కేసులపై సమీక్ష నిర్వహించారు.

Bodhan Crime Control | చట్ట వ్యతిరేక కార్యకలాపాలపై నిఘా..

డివిజన్ పరిధిలో చట్ట వ్యతిరేక కార్యకలాపాలపై నిఘా పెట్టాలని సీపీ సూచించారు. ఈ సందర్భంగా పోలీస్ స్టేషన్ పరిధిలో పెండింగ్​లో ఉన్న కేసులపై క్షుణ్ణంగా సమీక్ష చేశారు. సైబర్ నేరాలపై ప్రజల్లో పూర్తిస్థాయిలో అవగాహన కార్యక్రమం నిర్వహించాలన్నారు. ఆన్​లైన్​ మోసాలకు గురైన బాధితులకు సాయం చేయాలని పేర్కొన్నారు. ముఖ్యంగా డివిజన్ పరిధిలో జరిగిన హత్య, హత్యాయత్నం, చోరీలు మహిళలపై నేరాలు, సైబర్ మోసాలపై నమోదైన కేసులను పరిశీలించారు. పెండింగ్​లో ఉన్న కేసులను వేగంగా పూర్తి చేయాలని ఆదేశాలు జారీ చేశారు.

Bodhan Crime Control | నేరస్తుల కదలిక కదలికలపై..

డివిజన్ పరిధిలో నేరస్తుల కదలికలపై ఎప్పటికప్పుడు నిఘా ఉంచాలని సాయిచైతన్య తెలిపారు. రౌడీషీటర్లు పాత నేరస్తులు, బెయిల్​పై విడుదలైన వారిపై పర్యవేక్షణ కొనసాగించాలన్నారు. ప్రతి పోలీస్ స్టేషన్ పరిధిలో రాత్రి పహార వ్యవస్థను మరింత బలోపేతం చేయాలని పేర్కొన్నారు. అనుమానాస్పద వ్యక్తులు వాహనాల తనిఖీలను కట్టుదిట్టంగా నిర్వహించాలని పేర్కొన్నారు. డయల్ 112 గురించి ప్రజలకు అవగాహన కల్పించాలని పేర్కొన్నారు. కార్యక్రమంలో బోధన్ ఏసీపీ శ్రీనివాస్, సీసీఆర్​బీ ఏసీపీ గురునాయుడు, సీసీఆర్​బీ ఇన్​స్పెక్టర్​ అంజయ్య, స్పెషల్ బ్రాంచ్ ఇన్​స్పెక్టర్​ శ్రీధర్ రెడ్డి, సీఐ విజయ్​బాబు, ఎస్సైలు, ఐటీ కోర్​సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

ఇది కూడా చదవండి: Farmer ID Registration | ఫార్మర్​ ఐడీ లేకుంటే.. పథకాలన్నీ బంద్..!

తెలుగు జర్నలిజంలో 20 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2005లో ‘వార్త’ దినపత్రికలో స్పోర్ట్స్​ రిపోర్టర్​గా పనిచేశాను. అనంతరం రెండేళ్ల పాటు సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. 2010లో ‘సాక్షి’ జర్నలిజం స్కూల్​లో శిక్షణ పొందాను. అనంతరం ‘సాక్షి’ దినపత్రికలో సబ్​ఎడిటర్​గా చేరాను. సీనియర్​ సబ్​ ఎడిటర్​గా ప్రమోషన్​ పొందాను. 2024 నవంబర్​ నుంచి ‘అక్షరటుడే’లో చీఫ్​ సబ్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, స్థానికం, జనరల్​, క్రైం, వైరల్​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *