అక్షరటుడే, మాక్లూర్: Chain Snatching | నిజామాబాద్ పోలీస్ కమిషనరేట్ (Nizamabad Police) పరిధిలో చైన్ స్నాచింగ్లు ఆగట్లేదు. ఇటీవల జరుగుతున్న వరుస ఘటన కారణంగా ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు.
నగరంలోని దుబ్బ ప్రాంతంలో నెలరోజుల కిందట వాకిలి ఊడుస్తున్న మహిళ మెడలో నుంచి దుండగులు గొలుసు ఎత్తుకెళ్లారు. ఈ ఘటన మరువకముందే మాక్లూర్ మండల పరిధిలో గురువారం మరో ఘటన చోటుచేసుకుంది.
Chain Snatching | మాక్లూర్ మండలంలో..
మాక్లూర్ మండలంలోని గొట్టుముక్కల–మెట్పల్లి రహదారిలో గురువారం సాయంత్రం ఓ మహిళ నడుచుకున్న వెళ్తున్నారు. ఈక్రమంలో బ్లాక్ కలర్ బైక్పై వచ్చిన ఆగంతకుడు ఆమె మెడలో ఉన్న బంగారు గొలుసును తస్కరించాడు. అనంతరం వెంటనే మాయమయ్యాడు.
ఈ ఘటనతో భయభ్రాంతులకు గురైన మహిళ కొద్దిసేపటి తర్వాత తేరుకుని మాక్లూరు పోలీసులకు సమాచారం అందించారు. సమాచారం తెలుసుకున్న పోలీసులు సంఘటనాస్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
ఇది కూడా చదవండి: Banana Tree Vastu | ఇంటి ఆవరణలో అరటి చెట్టు నాటవచ్చా ?.. వాస్తు శాస్త్రం ఏం చెబుతుందంటే..