Independence Day | కట్టుదిట్టమైన భద్రత మధ్య స్వాతంత్య్ర దినోత్సవం

కట్టుదిట్టమైన భద్రత మధ్య స్వాతంత్య్ర దినోత్సవాన్ని నిర్వహించనున్నట్లు కలెక్టర్​ భవేష్​ మిశ్రా పేర్కొన్నారు.

shashi kiran Mottala

అక్షరటుడే, నిజామాబాద్​ క్రైం: Independence Day | కట్టుదిట్టమైన భద్రత మధ్య స్వాతంత్య్ర దినోత్సవాన్ని నిర్వహించనున్నట్లు కలెక్టర్​ భవేష్​ మిశ్రా పేర్కొన్నారు. సీపీ సాయిచైతన్య (CP Sai Chaitanya)తో కలిసి పరేడ్​ గ్రౌండ్​లో ఏర్పాట్లను ఆయన పరిశీలించారు.

Independence Day | పోలీస్ ​పరేడ్​ గ్రౌండ్​లో..

నగరంలోని పోలీస్​ పరేడ్​ గ్రౌండ్​లో వేదిక, బారికేడింగ్, అతిథుల కూర్చునే సీటింగ్​, పార్కింగ్, ట్రాఫిక్ నియంత్రణ, భద్రతా చర్యలు తదితర ఏర్పాట్లను కలెక్టర్ పరిశీలించారు. వేడుకలకు హాజరయ్యే ప్రజలు, అధికారులు, ప్రముఖులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని ఏర్పాట్లను సమన్వయంతో పూర్తి చేయాలని సంబంధిత అధికారులకు సూచించారు. ఆగస్టు 15న నిర్వహించనున్న కార్యక్రమం విజయవంతంగా, ప్రశాంత వాతావరణంలో జరిగేలా పటిష్టమైన బందోబస్తు, ట్రాఫిక్ నియంత్రణ చర్యలు చేపట్టాలని పోలీసు అధికారులను ఆదేశించారు. అదనపు కలెక్టర్ (లోకల్ బాడీస్) భుజంగ రావు, ఏఆర్ ఏసీపీ శ్రీరాములు, మున్సిపల్ కమిషనర్ దిలీప్ కుమార్, నిజామాబాద్ ఏసీపీ ప్రకాష్, స్పెషల్ బ్రాంచ్ ఇన్​స్పెక్టర్​ శ్రీధర్ రెడ్డి పాల్గొన్నారు.

ఇది కూడా చదవండి..: Excise Employee | అనుమానాస్పద స్థితిలో ఎక్సైజ్ ఉద్యోగి మృతి

తెలుగు జర్నలిజంలో 20 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2005లో ‘వార్త’ దినపత్రికలో స్పోర్ట్స్​ రిపోర్టర్​గా పనిచేశాను. అనంతరం రెండేళ్ల పాటు సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. 2010లో ‘సాక్షి’ జర్నలిజం స్కూల్​లో శిక్షణ పొందాను. అనంతరం ‘సాక్షి’ దినపత్రికలో సబ్​ఎడిటర్​గా చేరాను. సీనియర్​ సబ్​ ఎడిటర్​గా ప్రమోషన్​ పొందాను. 2024 నవంబర్​ నుంచి ‘అక్షరటుడే’లో చీఫ్​ సబ్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, స్థానికం, జనరల్​, క్రైం, వైరల్​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
1 Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *