అక్షరటుడే, వెబ్‌డెస్క్ : ED Raids Azam Khan | సమాజ్‌వాది పార్టీ నాయకుడు ఆజం ఖాన్‌కు చెందిన ట్రస్ట్, యూనివర్సిటీపై ఈడీ దాడులు చేసింది. మనీ లాండరింగ్ కేసు దర్యాప్తులో భాగంగా బుధవారం పది ప్రాంతాలలో సోదాలు నిర్వహించింది.
ఉత్తరప్రదేశ్ (Uttar Pradesh)లోని రాంపూర్, సహారన్పూర్, ఢిల్లీలోని వివిధ ప్రాంతాలలో ఈడీ అధికారులు దాడులు చేశారు. ఆజం ఖాన్‌కు చెందిన మౌలానా మహమ్మద్ అలీ జౌహర్ ట్రస్ట్, మహమ్మద్ అలీ జౌహర్ యూనివర్సిటీ ప్రాంగణాల్లో కూడా సోదాలు కొనసాగుతున్నాయి. ప్రభుత్వ కాంట్రాక్టు నిధులను ప్రైవేట్ కాంట్రాక్టర్ల ద్వారా మళ్లించడం, అనంతరం వాటిని యూనివర్సిటీ, ట్రస్ట్ ఆస్తుల సృష్టి వంటి పనులకు వినియోగించడం వంటి ఆరోపణలు ఆయనపై నమోదు అయ్యాయి.
ED Raids Azam Khan | భారీ విరాళాలు
కొంతమంది కాంట్రాక్టర్లకు, ట్రస్ట్‌కు మధ్య ఆర్థిక లావాదేవీలు జరిగినట్లు దర్యాప్తులో తేలింది. ప్రభుత్వ కాంట్రాక్టుల ద్వారా లబ్ధి పొందిన కాంట్రాక్టర్లు భారీ విరాళాలు, నిర్మాణ పనుల రూపంలో నిధులను ట్రస్ట్, యూనివర్సిటీ వైపు మళ్లించినట్లు అధికారులు గుర్తించారు. దీనికి సంబంధించిన ఆధారాలు సేకరించడానికి ఈడీ అధికారులు సోదాలు చేస్తున్నారు.
ఇది కూడా చదవండి..: Madras High Court | ఆలయాల్లో వివక్షకు తావులేదు : మద్రాస్ హైకోర్టు